మెగాస్టార్ ఇంటికి నెట్‌ఫ్లిక్స్‌ CEO.. ఈ కాంబోలో ఓ వెబ్ సిరీస్ ప్లీజ్?

మెగాస్టార్ ఇంటికి నెట్‌ఫ్లిక్స్‌ CEO.. ఈ కాంబోలో ఓ వెబ్ సిరీస్ ప్లీజ్?

నెట్‌ఫ్లిక్స్‌ కో- సీఈవో టెడ్‌ సరాండొస్‌ (Ted Sarandos) మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చారు. ఇందులో భాగంగా ఆయన చిరంజీవి, రామ్ చరణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో మెగాస్టార్ చిరంజీవి, రామ్‌ చరణ్‌తో పాటు సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej), వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej) నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులు ఉన్నారు. వీరితో సరదాగా కాసేపు ముచ్చటించారు టెడ్‌. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

టెడ్‌ సరాండొస్‌ మెగాస్టార్ ఇంటికి రావడంపై సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ఈ మీటింగ్ క్యాజువల్‌గానే జ‌రిగిందా లేక..  ఏదైనా ప్రాజెక్టు కోసమా అంటూ ఆరాలు తీస్తున్నారు నెటిజన్స్. ఇక మెగా ఫ్యాన్స్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌ కో- సీఈవో టెడ్‌ సరాండొస్‌ ను రిక్వెస్ట్ చేసుకునున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ కాంబోలో ఒక యాక్షన్ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేయమని కోరుకుంటున్నారు. మరి ఫ్యాన్స్ రిక్వెస్ట్ పై టెడ్‌ సరాండొస్‌  ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

ఇక చిరంజీవి, రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మెగాస్టార్ బింబిసార దర్శకుడు వశిష్ట తో విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కానుంది.