నెట్ఫ్లిక్స్ షాకింగ్ డెసిషన్.. సంక్రాంతికే OTTకి వస్తున్న సలార్?

నెట్ఫ్లిక్స్ షాకింగ్ డెసిషన్.. సంక్రాంతికే OTTకి వస్తున్న సలార్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabahs) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar). కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ మూవీ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విడుదలైన మొదటి రోజే రూ.178 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ.. కేవలం ఆరు రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

ఇదిలా ఉంటే.. సలార్ ఓటీటీ రిలీజ్ గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. సలార్ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాను జనవరి 12 సంక్రాంతి కానుకగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. సలార్ రిలీజై నెలరోజులు కూడా కాకపోవడంతో ఇంత తొందరగా ఓటీటీలో తీసుకొచ్చేందుకు మరికొంత అమౌంట్ ను ముట్టచెప్పనున్నారట నెట్ఫ్లిక్స్ యాజమాన్యం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకనట రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

ఈ వార్త గనక నిజమై సంక్రాంతికి సలార్ ఓటీటీకి వస్తే మాత్రం అది ఈ ఇయర్ లోనే బిగ్గెస్ట్ ఓటీటీ రిలీజ్ అవడం ఖాయం. దీంతో ఓటీటీలో కూడా సరికొత్త రికార్డ్స్ అన్నీ ప్రభాస్ పేరుమీదికి మారిపోతాయి. మరి నెట్ఫ్లిక్స్  సంస్థ నిజంగా సలార్ సినిమాను సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ చేస్తుందా? లేదా 50 రోజుల వరకు ఆగుతుందా? అనేది చూడాలి.