
ఏ మంచి పని చేయాలన్నా.. ఎలాంటి చెడు పని చేయాలన్నా .. ఇప్పుడే చేసేయ్.. లేదంటే మళ్లీ ఈ సంవత్సరంలో ఒక్క రోజు కూడా రేపు చేద్దాంలే అనుకొని.. చేయకుండానే మిగిలిపోతుంది. ఈ సంవత్సరంలో ఈ రోజే కాదు.. ఈ రోజులో వచ్చే ప్రతీ క్షణం ఈ సంవత్సరంలో చివరిదే. అలాగే చివరి సూర్యోదయం కూడా. ఈ సందర్భంగా నెటిజన్లు సూర్యుడు అస్తమిస్తున్న క్షణాల్లో దిగిన ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ద లాస్ట్ సన్ సెట్ ఇన్ 2022.. మళ్లీ వచ్చే ఏడాదిలో కలుసుకుందాం అంటూ పోస్టులు పెడుతున్నాయి. ఈ ఇయర్ లో ఏం జరిగినా మంచికే అనుకున్నాం. అలాగే ఏం జరగాలని ఉన్నా అదీ మంచికే అనుకుందాం. సూర్యాస్తమం రోజూ అవుతుందేమో.. కానీ గడిచిన ఏ ఒక్క క్షణం కూడా మళ్లీ రాదు. కాబట్టి ఈ ఏడాదిలో ఈ చివరి అస్తమయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నామో.. జీవితంలో వచ్చే అన్ని క్షణాలనూ ఆస్వాదించాలని కోరుకుంటూ.. హ్యాపీ న్యూ ఇయర్..