Vijay Thalapathy: కారును వెంబడించిన ఫ్యాన్స్.. విజయ్ చేసిన పనికి నెటిజన్స్ ఫిదా

Vijay Thalapathy: కారును వెంబడించిన ఫ్యాన్స్.. విజయ్ చేసిన పనికి నెటిజన్స్ ఫిదా

సౌత్ స్టార్ విజయ్ తలపతి(Vijay Thalapathy)కి ఉన్న క్రేజ్ గురించి, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నుండి ఒక సినిమా వస్తుందంటే చాలు మిగతా సినిమాల రికార్డ్స్ అన్నీ బ్రేక్ అవడం ఖాయం. ఇటీవలే లియో(Leo) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు విజయ్. లోకేష్(Lokesh) దర్శకత్వంలో వచ్చిన ఈ గ్యాంగ్ స్టార్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

ఈ సినిమా తరువాత విజయ్ ప్రస్తుతం దర్శకుడు వెంకంట్ ప్రభుతో గ్రేటెస్ట్ ఆప్ ఆల్ టైం(Greatest of alla time) అనే సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తుండగా.. ఆయనకు జోడిగా లేటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. ఈ షూటింగ్ కోసం విజయ్ మార్చ్ 18న కేరళకు వెళ్లారు. ఆయన రాకను ముందే పసిగట్టిన అక్కడి ఫ్యాన్స్ ఎయిర్ పోర్ట్ లో ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ALSO READ :- ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వెనక.. ఓ మీడియా సంస్థ యజమాని..?

అంతేకాదు.. ప్రత్యేక వాహనంలో ఆయన వెళ్తుండగా ఆయన కారును వెంబడిస్తూ వెళ్లి నా నా హంగామా చేశారు. అయితే అందులో ఒక వ్యక్తి విజయ్ కారు ముందుకు వచ్చి వీడియో తీయడం మొదలుపెట్టాడు. అది గమనించిన విజయ్.. నన్ను కాదు ముందు రోడ్డును చూసి బండి నడుపు అంటూ చేతులతో సైగ చేశాడు. ఆ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజన్స్ విజయ్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు. తన ఫ్యాన్స్ గురించి ఆయన తీసుకునే కేర్ గురించి కామెంట్స్ చేస్తున్నారు.