
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా తాజ్ మహల్ తో పాటు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సబర్మతి ఆశ్రమం సందర్శకుల డైరీలో ప్రధాని మోడీ గురించి ప్రస్తావించారు. ‘నా గొప్ప స్నేహితుడు, ప్రధాని మోడీకి ఈ అద్భుతమైన సందర్శనకు ధన్యవాదాలు’ అని రాశారు. అంతవరకు బాగానే ఉన్న కింద ట్రంప్ చేసిన సంతకంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆపరేషన్ థియేటర్ లో ఈసీజీని తలపించేలా సైన్ ఉండడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా నెటిజన్లు ట్రంప్ ను ట్రోల్ చేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
I showed Trump's signature to my pharmacist, he gave me medicines for 3 days. #TrumpInIndia pic.twitter.com/s40bMyUgip
— Sagar (@sagarcasm) February 24, 2020
ట్రంప్ సంతకం చూపించా ఫార్మసిస్ట్ 3రోజులకు మెడిసిన్ ఇచ్చాడంటూ సాగర్ అనే నెటిజన్ తనదైన స్టైల్లో సెటైర్లు వేశాడు.
Once In childhood I did same signature like Donald trump but that time my friend called me a potential doctor .#NamasteyTrump pic.twitter.com/DjwrmYmAIu
— JOSH ⚡?? (@NobitakaDost) February 24, 2020
నా చిన్నప్పుడు డోనాల్డ్ ట్రంప్ సైన్ చేసినట్లు నేను సైన్ చేశా. ఆ సైన్ చూసిన నా ఫ్రెండ్ నన్ను డాక్టర్ డాక్టర్ అని పిలిచాడని స్వీట్ మెమోరిస్ గుర్తు చేసుకున్నాడు మరో నెటిజన్.
Trump's signature reminds me of ecg ? #TrumpInIndia pic.twitter.com/L2iMGvJ4Ez
— Prakash Shetty (@kitneka) February 24, 2020
ట్రంప్ సంతకం నా హెల్త్ ఈసీజీ లా ఉందని ఓనెటిజన్ గుర్తు చేసుకున్నాడు.
see this- అమ్మాయితో మాట్లాడాడని యువకుడికి గుండు కొట్టించి..!