నెట్​లింక్స్​ లాభం రూ. 1.65 కోట్లు.. రెవెన్యూ రెట్టింపు

నెట్​లింక్స్​  లాభం రూ. 1.65 కోట్లు.. రెవెన్యూ రెట్టింపు

హైదరాబాద్​, వెలుగు : ఐఎస్​పీ, ఐటీఈఎస్​ రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నెట్​లింక్స్​ లిమిటెడ్​ క్యూ1 నికర లాభం 26 రెట్లు పెరిగి రూ. 1.65 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది జూన్​ క్వార్టర్​తో  పోలిస్తే రెవెన్యూ కూడా డబులై రూ. 4.66 కోట్లయింది. కిందటి ఫైనాన్షియల్​ ఇయర్​ మూడో క్వార్టర్లో దక్కించుకున్న రూ. 11.20 కోట్ల కాంట్రాక్టు రెవెన్యూ కొనసాగుతోందని, బోనస్​ షేర్ల జారీ ప్రక్రియ ఏప్రిల్​ 25 నాడు పూర్తయిందని నెట్​లింక్స్​  ఎండీ మనోహర్​ లోకారెడ్డి చెప్పారు. ఖర్చులు తగ్గించుకుని కంపెనీని మరింత లాభదాయకంగా మార్చుకోగలుగుతున్నామని పేర్కొన్నారు. షేర్​హోల్డర్లకు లాంగ్​టర్మ్​లో మరింత వాల్యూ క్రియేట్​ చేసే దిశలో పనిచేస్తున్నామని చెప్పారు. దేశపు ఎకానమీ వేగంగా ఎదుగుతున్న క్రమంలో ఈ ఫైనాన్షియల్​ ఇయర్లోనూ మంచి పెర్​ఫార్మెన్స్​ సాధించగలుగుతామనే ధీమాను మనోహర్​ వ్యక్తం చేశారు. 

గంటలోనే 3 వేల బుకింగ్స్​

ఓలా ఎలక్ట్రిక్  తన మూడవ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్​1 ఎయిర్ అమ్మకాలను మొదలుపెట్టింది. గురువారం అమ్మకాలను ఆరంభించిన గంటలోనే 3,000లకుపైగా యూనిట్లు బుక్ అయ్యాయని కంపెనీ పేర్కొంది.  ఎస్​1 ఎయిర్‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికే బుక్ చేసుకున్న వాళ్లకు రూ.1.09 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు అమ్ముతారు. మిగతావాళ్లు అదనంగా రూ.10 వేలు చెల్లించాలి.