వన్ సెకండ్.. వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టి తినొద్దు...

వన్ సెకండ్.. వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టి తినొద్దు...

ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు వంటి చాలా పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు వీటిని మనం ఫ్రిడ్జ్ లో పెట్టడం అందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్ని రకాల పదార్థాలను ఫ్రిడ్జ్ లో పెట్టినపుడు ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. కొన్ని సార్లు ఆ పదార్థాలు రుచిని కోల్పోవడం, పాడవడం, కుళ్లిపోవడమే కాకుండా ఆ పరిసర ప్రాంతాల్లో పెట్టిన పదార్ధాలు కూడా పాడవడం వంటి పరిణామాలు ఎదురవుతాయి. కాబట్టి ఫ్రిడ్జ్ లో ఏ ఆహార పదార్థాలను పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

టమాటాలు

టమాటాలను ఫ్రిడ్జ్ లో పెడితే చాలా కాలం నిల్వ ఉంటాయని అనుకుంటాం. కానీ దాని వల్ల అవి అసలు రుచిని కోల్పోతాయట. ఎందుకంటే ఫ్రిజ్ లోని చల్లని సెల్ గోడలు ఆ రుచిని గ్రహించి.. అసలు రుచిని విచ్చిన్నం చేస్తాయట. దీని వల్ల టమాటాలు కొన్నిసార్లు మెత్తగా కూడా మారతాయట.

తేనె

తేనెను ఫ్రిడ్జ్ లో ఉంచాల్సిన అవసరం లేదు. ఇది మామూలుగానే సహజ సంరక్షణ గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది బాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. బదులుగా తేనెను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల స్పటికీకరణకు అంటే గట్టిగా కావడానికి, కిణ్వ ప్రక్రియకు కూడా కారణమవుతుంది.

కాఫీ పొడి

కాఫీ పొడిని ఫ్రిడ్జ్ లో పెట్టినపుడు అది తేమ పరిస్థితులను ఎదుర్కొంటుంది. అంటే మెత్తబడుతుంది. దాని వల్ల ఇది తన అసలు రుచిని కోల్పోవడమే కాకుండా.. రుచుల్లో తేడాను కూడా ఇస్తుంది.

అరటిపండ్లు

అరటిని నిల్వ చేసేందుకు చల్లని ఉష్ణోగ్రతలు అనువైనవి కావు. తక్కువ ఉష్ణోగ్రతలు అరటిపండ్ల రంగును మారుస్తుంది. దీని వల్ల అవి నల్లగా మారి, త్వరగా పక్వానికి వచ్చి.. అంతే త్వరగా కుళ్లిపోతాయి.

ఉల్లిపాయలు

ఉల్లిపాయను చల్లని ప్రదేశంలో పెట్టినపుడు తేమను గ్రహిస్తాయి. ఫలితంగా వీటి వల్ల అసహ్యకరమైన వాసనలు ఉద్భవిస్తాయి. దీని వల్ల కొన్నిసార్లు ఫ్రిడ్జ్ మొత్తం చెడు వాసన పాకే అవకాశం ఉంటుంది. ఇది క్రమంలో పరిసర ప్రాంతాల్లో బాక్టీరియా పెరుగుదలకు కారణమవుతుంది.

ఎల్లిపాయలు

సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద, పొడి వాతావరణంలో వెల్లుల్లి చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది. కానీ అదే రిఫ్రిజిరేటర్ లో ఉంచినప్పుడు మాత్రం తీవ్ర పరిణామాలను కలిగిస్తుంది. ఇది ధీర్ఘ కాలంలో అక్కడే మొలకెత్తడానికి కూడా దారి తీస్తుంది.

బంగాళదుంపలు

బంగాళదుంపల్లో సాధారణంగా పిండి పదార్ధాలు ఉంటాయి. వీటిని నిల్వ ఉంచేందుకు చల్లని, చీకటి, పొడి వాతావరణం అనుకూలమైనది. కానీ ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల బంగాళదుంపల్లో ఉండే పిండి పదార్థం చక్కెరగా మారుతుంది. ఇవి అవాంఛిత తీపి రుచిని ఇస్తుంది.