
న్యూఢిల్లీ: మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్(ఎంఆర్ఎస్ఏఎమ్) ను ఇండియన్ నేవీ సక్సెస్ ఫుల్ గా పరీక్షించింది. ఈ మేరకు రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అరేబియా సముద్రంలో శుక్రవారం ఐఎన్ఎస్ కోచి, ఐఎన్ఎస్ చెన్నై యుద్ధనౌకలపై నుంచి మిస్సైల్ ను టెస్టు చేసినట్లు వెల్లడించింది. నేవీ, డీఆర్డీవో, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్(ఐఏఐ) పర్యవేక్షణలో టెస్టు ఫైరింగ్ జరిగినట్లు తెలిపింది. భవిష్యత్ నేవీ యాంటీ ఎయిర్ వార్ ఫేర్ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా ఇదో మంచి ముందడుగని పేర్కొంది. అన్ని యుద్ధనౌకల్లో మిస్సైల్ ను అందుబాటులోకి తెస్తామని నేవీ చెప్పింది. డీఆర్డీవో, ఐఏఐ ఎంఆర్ఎస్ఏఎమ్ మిస్సైల్ ను అభివృద్ధి చేశాయి.