ఇక కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఏఐ నే.. జెమినీ 2.5 వింతలు..

ఇక కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఏఐ నే.. జెమినీ 2.5 వింతలు..

న్యూఢిల్లీ: టెక్ ​కంపెనీ గూగుల్ ఏఐ టెక్నాలజీలో మరో ముందడుగు వేసింది. కంప్యూటర్​ స్క్రీన్​పై మనిషిలాగే పనులు చేయగలిగే కొత్త ఏఐ మోడల్​ను జెమినీ 2.5 కంప్యూటర్ యూజ్ పేరుతో విడుదల చేసింది. ఇదిబ్రౌజర్‌‌ ద్వారా ఇంటర్నెట్‌‌ను ఉపయోగించగలదు. 

ఫారమ్‌‌లను నింపడం, సబ్​మిట్ చేయడం లాంటి పనులను  చేయగలదు.  క్లిక్ చేయడం, టైపింగ్ చేయడం, పేజీలను స్క్రోల్ చేయడం, కీబోర్డ్ కాంబినేషన్​లను ఉపయోగించడం లాంటి పనులనూ చేస్తుంది.  

ఇందుకోసం ఇది మొదట స్క్రీన్‌‌షాట్​ను తీసుకుంటుంది. దాంట్లోని విజువల్స్​ను అర్థం చేసుకొని, యూజర్ కోరిన పనిని పూర్తి చేయడానికి ఏది సరైనదో నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాతే మౌస్​ క్లిక్​లు, కీబోర్డ్ ఇన్​పుట్​లను జనరేట్ చేస్తుంది.  ప్రస్తుతానికి ఇది డెవలపర్ల కోసం మాత్రమే అందుబాటులో ఉంది.