రావణాసురలో కొత్తగా కనిపిస్తా : సుశాంత్

రావణాసురలో కొత్తగా కనిపిస్తా : సుశాంత్

రవితేజ హీరోగా సుధీర్ వర్మ తెరకెక్కించిన ‘రావణాసుర’ చిత్రంలో రామ్‌‌ అనే కీలకపాత్రలో నటించాడు సుశాంత్. అభిషేక్ నామా నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 7న విడుదలవుతున్న సందర్భంగా సుశాంత్ మాట్లాడుతూ ‘ఇదొక ఎక్సయిటింగ్ థ్రిల్లర్. చాలా కొత్త ఎలిమెంట్స్ వున్నాయి. ట్రీట్ మెంట్ కూడా కొత్తగా వుంటుంది.  ఇందులో నా పాత్ర ఎలా ఉండబోతోంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. వెర్సటైల్ యాక్టర్‌‌‌‌గా అన్ని రకాల పాత్రలు చేయాలనేది నా ఆలోచన. ‘రావణాసుర’లో ఆ కొత్తదనం ఉంది. ముఖ్యంగా రవితేజ గారి కాంబినేషన్‌‌లో వచ్చే సీన్స్ ఇంటరెస్టింగ్‌‌గా ఉంటాయి. 

చాలా డిఫరెంట్ మూవీ. సినిమా చూసిన ప్రేక్షకులు కొత్తగా ఫీల్ అవుతారు. వాళ్లు నన్నెలా రిసీవ్‌‌ చేసుకుంటారా అనే ఎక్సయిట్‌‌మెంట్ ఉంది. నా సినిమాల మధ్య గ్యాప్ ఎందుకు వస్తుందో నాకే తెలియడం లేదు. నా మైండ్‌‌లో మాత్రం ఎప్పుడూ నా నెక్స్ట్‌‌ మూవీనే ఉంటుంది. గత ఆరు నెలలుగా ఫుల్‌‌ బిజీగా వున్నాను. సోలో హీరోగా ఒక కథ ఓకే చేశా. ఇంకొన్ని కథలు వింటున్నా. ‘అల వైకుంఠపురములో’ చిత్రం నాకు నార్త్‌‌లోనూ ఫేమ్ తీసుకొచ్చింది. దాంతో అలాంటి అవకాశాలు చాలా వచ్చాయి. కానీ నన్ను ఎక్సయిట్ చేసిన రావణాసుర, భోళా శంకర్ లాంటి సినిమాలకు మాత్రమే ఓకే చెప్పా’ అన్నాడు.