
రాచకొండ : ఉప్పల్ పోలీసులు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని పసి కందును గొంతు నులిమి హత్యచేశారు గుర్తు తెలియని దుండగులు. చిలక నగర్ స్మశానవాటికలో పడేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఉప్పల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని… మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.