సొంత నిధులతో సహకార సంఘానికి కొత్త భవనం : దేవర వెంకట్రెడ్డి

సొంత నిధులతో సహకార సంఘానికి కొత్త భవనం : దేవర వెంకట్రెడ్డి
  • మార్చిలోగా నిర్మాణాన్ని పూర్తి చేస్తం: చేవెళ్ల సొసైటీ చైర్మన్ దేవర వెంకట్రెడ్డి

చేవెళ్ల, వెలుగు: తన సొంత నిధులతో చేవెళ్ల సహకార సంఘానికి కొత్త బిల్డింగ్​ను నిర్మించనున్నట్లు ఆ సొసైటీ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి తెలిపారు. శనివారం చేవెళ్లలోని సహకార సంఘం ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. 2013, 2019లో జరిగిన చేవెళ్ల సహకారం సంఘం ఎన్నికల్లో వరుసగా గెలుపొంది రెండోసారి చైర్మన్​గా బాధ్యతలు చేపట్టి సంఘాన్ని అభివృద్ధి చేశానన్నారు. ప్రస్తుతం తన సొంత నిధులు సుమారు రూ.30 లక్షల నుంచి 35 లక్షల  ఖర్చుతో సహకార సంఘానికి కొత్త బిల్డింగ్ నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. 

దసరా నవరాత్రుల్లో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి వచ్చే ఏడాది మార్చిలోగా నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. కొత్త బిల్డింగ్​లోనే సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజా అగిరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చిల్కూరి వెంకటేశ్, పీఏసీఎస్ డైరెక్టర్లు పాటి దామోదర్ రెడ్డి, పోతుగంటి రాములు, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు దేవర సమతారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డు మెంబర్ హరికృష్ణ, కో ఆప్షన్ మెంబర్ నారాయణ, సీఈవో వెంకటయ్య, సహకార సంఘం సభ్యులు పాల్గొన్నారు.