వికారాబాద్లో డీజేలకు పర్మిషన్ లేదు: జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా

వికారాబాద్లో డీజేలకు పర్మిషన్ లేదు: జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా
  • రిసార్టులు, ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లు, టూరిస్టు ప్లేసుల్లో పర్మిషన్​తప్పనిసరి 
  • మైనర్లకు మద్యం సరఫరా చేస్తే నిర్వాహకులపై క్రిమినల్ కేసులు

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ ​జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లు, రిసార్టులు, పర్యాటక ప్రాంతాల యజమానులు కొత్త సంవత్సర ఈవెంట్స్ ​నిర్వహిస్తే తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని, లేకపోతే చర్యలు తప్పవని ఎస్పీ స్నేహా మెహ్రా హెచ్చరించారు. మంగళవారం తన ఆఫీసులో ఆమె మాట్లాడుతూ.. పోలీసులు సూచించిన టైమింగ్స్ ​కచ్చితంగా పాటించాలన్నారు. న్యూ ఇయర్​వేడుకల్లో ఎక్కడా డీజే  సిస్టమ్‌‌‌‌లకు అనుమతి ఇవ్వలేదన్నారు.

మైనర్లకు మద్యం సరఫరా చేస్తే నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అత్యుత్సాహంతో అర్ధరాత్రి టూవీలర్లపై పెద్ద పెద్ద శబ్దాలతో న్యూసెన్స్​చేసినా, ఈవ్ టీజింగ్‌‌‌‌కు పాల్పడినా చర్యలు తప్పవన్నారు.

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్​డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిస్తామని, దొరికతే కేసులు బుక్​చేస్తామన్నారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక ఆఫీసర్లను నియమించామన్నారు.