తాగి డ్రైవ్ చేస్తే దొరికిపోతరు.. కార్లలో కొత్త టెక్నాలజీ!

తాగి డ్రైవ్ చేస్తే దొరికిపోతరు.. కార్లలో కొత్త టెక్నాలజీ!

రోడ్ యాక్సిడెంట్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. ఆల్కహాల్ తాగి బండి నడుపుతూ తమతోపాటు ఇతరుల ప్రాణాలకు కొందరు ముప్పు తీసుకొస్తున్నారు. పోలీసులు ఫైన్లు వేసినప్పటికీ అనుకున్నంత మార్పు రావడం లేదు. మన దేశంలోనే గాక అమెరికా లాంటి విదేశాల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ డెత్స్ పెరిగిపోయాయి. అందుకే యూఎస్ ఈ విషయంలో సీరియస్‌గా ఆలోచిస్తోంది. కార్లలో ఒక కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టాలని అగ్రరాజ్యం భావిస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్లను తగ్గించే క్రమంలో పలు సేఫ్టీ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. 

కొత్త టెక్నాలజీ గురించి తెలుసా?
తాగి బండి నడిపే వారిని గుర్తుపట్టేలా అమెరికాలో ఓ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. దీన్ని కొత్తగా తయారయ్యే కార్లలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ టెక్నాలజీతో తాగి నడిపే డ్రైవర్లను గుర్తించడం పోలీసులకు సులువవుతుంది. తద్వారా యాక్సిడెంట్లను అడ్డుకోవడం వీలవుతుందని యూఎస్ భావిస్తోంది. అయితే ఈ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన మౌలిక వసతులు, ఏర్పాట్ల బిల్లుపై యూఎస్ సెనేట్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. కొత్తగా తయారయ్యే కార్లలో ఆటోమెటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, క్రాష్ అవాయిడెన్స్ సిస్టమ్‌ను కూడా తప్పక చేర్చాలని బిల్లులో పేర్కొన్నారు. 

ఈ టెక్నాలజీ ఎలా పని చేస్తుంది?
యూఎస్ కొత్తగా తీసుకురానున్న డ్రంక్ డిటెక్షన్ టెక్నాలజీలో డ్రైవర్ కళ్లను సెన్సార్ ద్వారా స్కాన్ చేస్తారు. డ్రైవింగ్ సమయంలో డ్రైవర్ ఎంత అప్రమత్తతతో ఉన్నాడో దీని ద్వారా తెలుసుకోవచ్చు. డ్రైవర్ అలసటతో ఉన్నాడా, ఆదమరిచి డ్రైవింగ్ చేస్తున్నాడా, పరధ్యానంగా ఉన్నాడా అనేది అతడి కళ్లను స్కానింగ్ చేయడం ద్వారా పసిగడతారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. కార్లలో చిన్నారులను వదిలివెళ్లిన పలు ఘటనల్లో ఊపిరాడక లేదా భయపడి పలువురు పిల్లలు మృతి చెందడాన్ని చూసుంటాం. కాబట్టి పిల్లలు కార్లలో ఉన్న సమయంలో ఒకవేళ మర్చిపోయి డోర్ లాక్ చేయకపోతే అలర్ట్ చేసేలా మరో టెక్నాలజీని ప్రవేశ పెట్టేందుకు యూఎస్‌లో యత్నిస్తున్నారు. కారు ఇంజిన్ ఆఫ్ చేసినప్పుడు బ్యాక్ సీట్‌ను చెక్ చేసుకునేందుకు డ్రైవర్‌కు అలర్ట్ వెళ్లేలా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు.