చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా అనిల్ చౌహాన్ నియామకం

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా అనిల్ చౌహాన్ నియామకం

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ నియమితులయ్యారు. బిపిన్ రావత్ మరణంతో ఆర్మీలో దాదాపు 40ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేసిన చౌహాన్ను కేంద్రం సీడీఎస్ గా నియమించింది. 2021లో ఈస్ట్రన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్‌గా ఉన్నప్పుడు ఆయన రిటైర్ అయ్యారు. అనంతరం జాతీయ భద్రతామండలి సలహాదారుడిగా కొనసాగుతున్నారు.

అనిల్ చౌహన్ 1967 మే 18న జన్మించారు. 1981లో 11 గుర్ఖా రైఫిల్స్ లో చేరారు. 2019 సెప్టెంబర్ నుంచి ఈస్ట్రన్ ఆర్మీ కమాండ్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. రిటైర్ అయ్యే వరకు ఈ బాధ్యతల్లో కొనసాగారు. జమ్మూ కాశ్మీర్ సహా ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు గ్రూపులను నిరోధించడంలో ఆయనకు విశేష అనుభవం ఉంది. సైన్యంలో తన సేవలకు గానూ చౌహాన్ పరమ విశిష్ట సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం సహా పలు పతకాలను అందుకున్నారు.

త్రివిధ దళాలను ఏకతాటిపైకి తేవాలన్న ఉద్ధేశ్యంతో కేంద్రం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ ను ఏర్పాటు చేసింది. దేశ తొలి సీడీఎస్ గా బిపిన్ రావత్ పనిచేశారు. అయితే 2021 డిసెంబర్ లో జరిగిన హెలీకాఫ్టర్ ప్రమాదంలో ఆయన మరణించారు.