ఏపి బీజేపీకి కొత్త కోర్ కమిటీ

V6 Velugu Posted on Nov 29, 2021

అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త కోర్ కమిటీని నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. కొత్త కోర్ కమిటీలో 13 మంది సభ్యులు, ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. ప్రకటించిన ఈ కోర్ కమిటీ సమావేశాన్ని నెలకి ఒకసారైనా తప్పనిసరిగా జరపాలని నిర్ణయించారు. 
ఈ కమిటీలో పార్టీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి పురందరేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఎంపీలు జీవీఎల్, సిఎం రమేష్, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ, మధుకర్ జి, మాధవ్, రేలంగి శ్రీదేవి, చంద్రమౌళి, నిమ్మక్క జయరాజు ఉన్నారు. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా నేషనల్ జాయింట్ సెక్రటరీ శివ ప్రకాష్ జి, ఏపీ ఇంచార్జ్ మురళీధరన్, సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్ ఉన్నారు. 

Tagged Bjp, VIjayawada, AP, Amaravati, Andhra Pradesh, members, somu veerraju, core committee, bejawada, special invitees

Latest Videos

Subscribe Now

More News