మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. ఏప్రిల్ నుంచి రూల్స్ మారుతున్నాయ్

మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. ఏప్రిల్ నుంచి రూల్స్ మారుతున్నాయ్

మీరు క్రెడిట్ కార్డు వారు తున్నారా.. క్రెడిట్ కార్డు వినియోగంలో ఇప్పటికే ఉన్న రూల్స్ గురించి మనకు తెలిసిందే.. రాబోయే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ నుంచి క్రెడిట్ కార్డు వినియోగంపై కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఈ రూల్స్ ఏప్రిల్ 1 ,2024 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ కొత్త రూల్స్ ఏమిటో చూద్దాం.. 

SBI క్రెడిట్ కార్డు మార్పులు : AURUM, SBI కార్టు ఎలైట్, SBI కార్టు ఎలైట్ అడ్వాంటేజ్, SBI కార్టు పల్స్, సింప్లిక్లిక్ SBI కార్డు వంటి ప్రముఖ క్రెడిట్ కార్డులలో కొన్ని క్రెడిట్ కార్డుల కోసం రెంట్ చెల్లింపుల ట్రాన్జక్షన్లపై రివార్డు పాయింట్లు నిలిపివేయబడతాయి. ఇంకా రివార్డ్ పాయింట్ల వినియోగం ఏప్రిల్ 15, 2024 న ముగుస్తుంది. 

ఏప్రిల్ 1  నుంచి YES బ్యాంకు క్రెడిట్ కార్డు మార్పులు :రూ. 10వేలు అంతకంటే ఎక్కువ ఖర్చు చేసే YES బ్యాంకు క్రెడిట్ కార్డులు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ కు అర్హులు. 

ఏప్రిల్ 1  నుంచి ICICI బ్యాంకు క్రెడిట్ కార్డు మార్పులు :ICICI బ్యాంకు వెబ్ సైట్ ప్రకారం గత త్రైమాసికంలో రూ. 35వేలు ఖర్చు చేయడం ద్వారా ఒక కాంప్లిమెంటరీ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ ను పొందవచ్చు. అంటే జనవరి -ఫిబ్రవరి-మార్చి 2024 త్రైమాసికంలో కనీసం 35వేల రూపాయలు ఖర్చు చేస్తే ఏప్రిల్ -మే-జూన్ 2024 త్రైమాసికంలో కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ కు అర్హత పొందవచ్చు. 

ఏప్రిల్ 20 నుంచి Axis బ్యాంకు  క్రెడిట్ కార్డు మార్పులు : పెట్రోల్, ఇన్సూరెన్స్, గోల్డ్ పై ఖర్చు చేసే ఖర్చు కు ఎడ్జ్ రివార్డు పాయింట్లు ఉండవు.