
- ఒకటి, రెండు రోజుల్లో ప్రకటన
హైదరాబాద్, వెలుగు : లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలో పార్టీ సంస్థాగత మార్పులపై రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కసరత్తు పూర్తి చేశారు. పార్టీ పరంగా బీజేపీకి 38 జిల్లాలు ఉండగా.. అందులో కనీసం సగానికి పైగా జిల్లా అధ్యక్షులను మార్చాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ హైకమాండ్ కూడా కిషన్ రెడ్డికి దీనిపై పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దీంతో ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది. బుధవారం కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో దీనిపై కూడా ఆయన మరోసారి ఢిల్లీ పెద్దలతో మాట్లాడనున్నారు.
పార్టీ ఆఫీస్ బేరర్లలో కొందరిని మార్చడం, అదనంగా మరో ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సరిగా పని చేయని, పార్టీ పరమైన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వర్తించని జిల్లా అధ్యక్షులపై వేటు పడే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 10 సీట్లు, 35 శాతం ఓట్లు సాధించాలని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల హైదరాబాద్ లో పార్టీ ముఖ్య నేతల మీటింగ్ లో దిశా నిర్దేశం చేశారు. దానికి అనుగుణంగా చురుకైన వారికి పార్టీ పదవుల్లో పెద్దపీట వేయనున్నారు. కిషన్‌రెడ్డి కొత్త టీమ్‌తో లోక్ సభ ఎన్నికల సమరానికి వెళ్లనున్నారు.గద్దర్ జయంతిని అధికారికంగా చేయండి