2024 ఎలక్షన్స్​కు కొత్త ఈవీఎంలు

2024 ఎలక్షన్స్​కు కొత్త ఈవీఎంలు
  • 1,891 కోట్లు కేటాయింపు

న్యూఢిల్లీ: 2024 లో జరగనున్న అసెంబ్లీ, లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎలక్షన్స్​కు కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)​లను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్​లో న్యాయ మంత్రిత్వ శాఖకు పోల్ ప్యానెల్ ద్వారా రూ.1,891.78 కోట్లు కేటాయించింది. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ యూనిట్ల (పేపర్‌‌‌‌‌‌‌‌ ట్రయల్ మెషీన్లు) కొనుగోలు, వాడుకలో లేని ఈవీఎంల ధ్వంసం కోసం ఎన్నికల కమిషన్‌‌‌‌‌‌‌‌కు ఈ నిధులు కేటాయించారు.

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి కొత్త ఈవీఎంలను కొనుగోలు చేయనున్నారు. లైఫ్​టైం పూర్తయిన ఈవీఎంలు, పాడైపోయిన వాటిని మార్చనున్నారు. ప్రస్తుతం ఉన్న ఈవీఎంలను 2004 నుంచి నాలుగు లోక్‌‌‌‌‌‌‌‌సభ, 139 అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించారు.