ట్విట్టర్‌లో భారత యూజర్ల కోసం కొత్త ఫీచర్

ట్విట్టర్‌లో భారత యూజర్ల కోసం కొత్త ఫీచర్

సోషల్‌ మీడియాలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ట్విట్టర్‌. యూజర్ల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూ వస్తోన్న ట్విట్టర్‌ తాజాగా మరో అద్భుత ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇకపై ట్వీట్‌ చేయాలంటే టైపింగ్‌ చేయాల్సిన పని లేకుండా వాయిస్‌ ట్వీట్‌ అనే కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. ట్విట్టర్‌ ప్రస్తుతం ఈ ఫీచర్ IOS యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. IOS ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో నడిచే ఐఫోన్‌, ఐపాడ్‌ను ఉపయోగిస్తోన్న యూజర్లు ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు 20 సెకన్ల నిడివి ఉంటే ఆడియోను ట్వీట్‌ చేయొచ్చు. 

యూజర్లు ముందుగా ట్విట్టర్‌ అకౌంట్‌ను ఓపెన్‌ చేయాలి. తర్వాత కంపోజ్‌ ట్వీట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత వేల్‌ లెంగ్త్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకొని వాయిస్‌ ట్వీట్‌ను రికార్డు చేయాలి. వాయిస్‌ను రికార్డు చేయడం పూర్తయిన తర్వాత ‘డన్‌’ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేసి ట్వీట్‌ షేర్‌ చేస్తే సరిపోతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కేవలం ఐఓఎస్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో ఎప్పుడు తీసుకొస్తామనే దానిపై ట్విట్టర్‌ యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు.