
వాషింగ్టన్: ఇండియా, ఇజ్రాయెల్, యూఏఈతో పాటు అమెరికా భాగస్వామ్యంతో ఐ2యూ2 అనే సరికొత్త గ్రూప్ ఏర్పడింది. ఈ గ్రూప్ జులైలో వర్చువల్ మీటింగ్‌కు సిద్ధం అవుతున్నట్టు వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. అమెరికా అలయన్స్గా ఉన్న ఈ గ్రూప్‌ను ప్రపంచవ్యాప్తంగా బలోపేతం చేయాలనే ఆలోచనలతో బైడెన్ చర్యలు తీసుకుంటున్నారు. ఈ గ్రూప్‌లో భాగంగా ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, ఇజ్రాయెల్ పీఎం నెఫ్తాలీ బెన్నెట్‌తో పాటు యూఏఈ ప్రెసిడెంట్మహ్మద్ బిన్ జాయేద్లు తొలిసారి వర్చువల్‌గా మీట్అవుతున్నారు. వరల్డ్‌వైడ్‌గా నెలకొన్న ఫుడ్ క్రైసిస్, సెక్యూరిటీ, కరోనా పరిస్థితులు, క్లైమేట్ చేంజ్‌తో పాటు మేజర్ ప్రాబ్లమ్స్‌పై చర్చిస్తారని వైట్‌హౌస్ తెలిపింది. జులై 13 నుంచి 16 మధ్య బైడెన్ మిడిల్ ఈస్ట్‌లో పర్యటించనున్నారని, ఇదే సమయంలో ఈ వర్చువల్ మీటింగ్ ఉంటదని ప్రకటించింది. మోడీ, మహ్మద్ బిన్ జాయేద్‌తో పాటు బెన్నెట్‌తో కలిసి ముందుకు వెళ్లాలని బైడెన్ నిర్ణయించినట్టు తెలిపింది. మూడు దేశాలూ టెక్నాలజీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్నాయని, ఇండియాలో మంచి కన్జూమర్ మార్కెట్ఉందని, హైటెక్ ఎక్విప్మెంట్ తయారు చేయడంలో నాలెడ్జ్ ఉందని వైట్‌హౌస్ వివరించింది. ఇండియాతో కలిసి పనిచేసేందుకు జో బైడెన్ ఆసక్తి చూపుతున్నారని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. బయో టెక్నాలజీ డెవలప్మెంట్కూడా మెయిన్ ఎజెండా అని, మూడు దేశాలతో వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు నిర్ణయించారని చెప్పారు.