కరోనా పేషెంట్ల డిశ్ఛార్జ్ కు కొత్త గైడ్ లైన్స్

కరోనా పేషెంట్ల డిశ్ఛార్జ్ కు కొత్త గైడ్ లైన్స్
  • విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ

న్యూఢిల్లీ : కరోనా పేషెంట్ల డిశ్ఛార్జ్ కు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. లక్షణాలను బట్టి డాక్టర్ల అబ్జర్వేషన్ టైమ్ ఎంత ఉండాలనేది తెలిపింది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించింది. మైల్డ్, మీడియం లక్షణాలు ఉన్న వారిని ఎక్కువ రోజులు హాస్పిటల్ లో ఉంచాల్సిన అవసరం లేదని తెలిపింది. స్వల్పంగా లక్షణాలు ఉన్న వారు మూడు రోజుల కన్నా ఎక్కువ జ్వరం లేకపోతే వారికి ఎలాంటి టెస్ట్ లు లేకుండానే 10 రోజుల్లో డిశ్ఛార్జ్ చేయవచ్చని తెలిపింది. ఆక్సిజన్ సాచురేషన్ 95 శాతం కన్నా తక్కువగా ఉంటే మాత్రం వారిని హాస్పిటల్ తీసుకురావాలని…లేదంటే డిశ్ఛార్జ్ అయ్యాక వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంటే సరిపోతుందని ప్రకటించింది. మీడియం రేంజ్ లో లక్షణాలు ఉన్న వారిని మాత్రం 10 రోజుల పాటు డాక్టర్ల అబ్జర్వేషన్ లో ఉంచాల్సిందేనని …ఆ సమయంలో వారికి మూడు రోజుల పాటు జ్వరం లేనట్లైయితే నాలుగు రోజుల పాటు ఆక్సిజన్ సాచురేషన్ 95 శాతం కన్నా ఎక్కువ గా ఉంటే ఇలాంటి వారిని 10 రోజుల్లో డిశ్ఛార్జ్ చేయవచ్చని తెలిపింది. దేశంలో కరోనా కేసుల్లో ఇలాంటివే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి వారికి పెద్దగా సమస్యలు లేకపోవటంతో కొత్త గైడ్ లైన్స్ ఇచ్చారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న వారి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనని తెలిపింది. పూర్తిగా లక్షణాలు తగ్గి ఆర్టీ పీసీఆర్ టెస్ట్ ల్లో నెగిటివ్ అని తేలే వరకు డిశ్ఛార్జ్ చేయవద్దని కోరింది.