రవితేజ ఫ్యామిలీ నుంచి కొత్త హీరో

రవితేజ ఫ్యామిలీ నుంచి కొత్త హీరో

రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ‘పెళ్లిసందD’ ఫేమ్ గౌరి రోణంకి దర్శకత్వంలో జె.జె.ఆర్. రవిచంద్ నిర్మిస్తున్నారు. గురువారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైన ఈ మూవీ ముహూర్తపు షాట్‌‌కి దర్శకులు కె.రాఘవేంద్రరావు క్లాప్ కొట్టారు. నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచాన్ చేశారు. బెక్కెం వేణుగోపాల్, చదలవాడ శ్రీనివాసరావు, నటుడు రఘు తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నామని..  హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు దర్శక నిర్మాతలు.