ఇన్​కమ్​ టాక్స్​ కొత్త రూల్స్ అమల్లోకి

ఇన్​కమ్​ టాక్స్​ కొత్త రూల్స్ అమల్లోకి

న్యూఢిల్లీ: బడ్జెట్‌‌‌‌లో ప్రకటించిన కొత్త ట్యాక్స్‌‌‌‌ విధానం ఏప్రిల్‌‌‌‌ 1 నుంచి అమలులోకి వచ్చింది. పాత విధానాన్ని కూడా ట్యాక్స్‌‌‌‌ పేయర్లు ఫాలో అయ్యే అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. కొత్త విధానంలో ట్యాక్స్‌‌‌‌ స్లాబ్‌‌‌‌లను ప్రభుత్వం తగ్గించింది. కొత్త ట్యాక్స్‌‌‌‌ విధానాన్ని ఎంచుకుంటే ట్యాక్స్‌‌‌‌పేయర్లు సెక్షన్‌‌‌‌ 80 సీ కింద వచ్చే ట్యాక్స్ మినహాయింపులను వదులు కోవాల్సి ఉంటుంది.  స్టాండర్డ్‌‌‌‌ డిడక్షన్‌‌‌‌, హౌస్‌‌‌‌ రెంట్‌‌‌‌ అలవెన్సెస్‌‌‌‌, లీవ్‌‌‌‌ ట్రావెల్‌‌‌‌ అలొవెన్సెస్‌‌‌‌(ఎల్‌‌‌‌టీఏ), హోమ్‌‌‌‌ లోన్లపై చెల్లించే వడ్డీ వంటి వాటిని తమ ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ నుంచి మినహాయించుకోవడానికి వీలుండదు. యంగ్‌‌‌‌, సీనియర్ సిటిజన్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ పేయర్లు కొత్త ట్యాక్స్‌‌‌‌ విధానాన్ని ఎంచుకోవడం మంచిదని విశ్లేషకులు చెప్పారు.

ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌పై డివిడెండ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ భారం

మ్యూచువల్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌ లేదా డొమెస్టిక్ కంపెనీల నుంచి తీసుకునే డివిడెండ్లపై ఇన్వెస్టర్లు ట్యాక్స్‌‌‌‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు‌‌‌‌ మ్యూచువల్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌లో పెట్టిన ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లపై డివిడెండ్లను పొందితే వీటిపై ట్యాక్స్‌‌‌‌ను ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌ తన ట్యాక్స్‌‌‌‌ స్లాబ్‌‌‌‌కు తగ్గట్టు చెల్లించాల్సి ఉంటుంది. ముందు ఈ ట్యాక్స్‌‌‌‌ను మ్యుచువల్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌, కంపెనీలే చెల్లించేవి. కొత్త ట్యాక్స్‌‌‌‌ విధానం వలన హయ్యర్ ట్యాక్స్‌‌‌‌ బ్రాకెట్స్‌‌‌‌లో ఉన్నవారిపై ఎక్కువగా ట్యాక్స్‌‌‌‌ భారం ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌ డివిడెండ్ల రూపంలో రూ. 5,000 కు పైగా పొందితే, 10 శాతం టీడీఎస్‌‌‌‌ను కూడా కట్టాలి.

ఎంప్లాయర్‌‌‌‌‌‌‌‌ కంట్రిబ్యూషన్‌‌‌‌పై ట్యాక్స్‌‌‌‌ ఉద్యోగిపైనే..

ఏడాదిలో ఎన్‌‌‌‌పీఎస్‌‌‌‌, సూపర్‌‌‌‌‌‌‌‌ యాన్యూషన్‌‌‌‌ ఫండ్‌‌‌‌, ఈపీఎఫ్‌‌‌‌లలో  ఎంప్లాయర్‌‌‌‌‌‌‌‌కంట్రిబ్యూషన్‌‌‌‌ రూ. 7.5 లక్షలు దాటితే, ఆ అమౌంట్‌‌‌‌పై ట్యాక్స్‌‌‌‌ను ఉద్యోగి చెల్లించాల్సి ఉంటుం ది. ఇది కొత్త, పాత రెండు ట్యాక్స్‌‌‌‌ విధానాలలో కూడా అమలవుతుంది. కొత్త ట్యాక్స్‌‌‌‌ విధానాన్ని ఎంచుకున్నప్పటికి ఉద్యోగి ఎన్‌‌‌‌పీఎస్‌‌‌‌లో ఎంప్లాయర్‌‌‌‌‌‌‌‌ కంట్రిబ్యూషన్‌‌‌‌పై  ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్‌‌‌‌ డిడక్షన్‌‌‌‌ను క్లయిమ్‌‌‌‌ చేసుకోవచ్చు. గరిష్టంగా శాలరీలో 10 శాతం(బేసిక్ + డీఏ) వరకు మినహాయింపును కోరొచ్చు. అదే సెంట్రల్‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌ ఉద్యోగులయితే గరిష్టంగా 14 శాతం వరకు ట్యాక్స్‌‌‌‌ డిడక్షన్‌‌‌‌ను క్లయిమ్‌‌‌‌ చేయవచ్చు.