హోటళ్లలో తెల్లవారుజామున 4 గంటల వరకూ లిక్కర్ సప్లై

హోటళ్లలో తెల్లవారుజామున 4 గంటల వరకూ లిక్కర్ సప్లై

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆ రాష్ట్రంలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీల్లోని హోటల్స్‌లో తెల్లవారు జామున 4 గంటల వరకు లిక్కర్ సర్వ్ చేసేందుకు అనుమతివ్వబోతోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని అమలులోకి తేవాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాపారవేత్తలు, టూరిస్టులు ఎక్కువగా వస్తున్న నగరాల్లో ఈ కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు.

తెల్లవారు జామున నాలుగు గంటల వరకు లిక్కర్ సర్వ్ చేసేందుకు అనుమతులను గంపగుత్తగా ఇవ్వడం లేదని ఆ రాష్ట్ర ఎక్సైస్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ భూస్రెడ్డి తెలిపారు. దరఖాస్తు పెట్టుకున్న హోటళ్లకు మాత్రమే పర్మిషన్ ఇస్తామని చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ బాగా పెరుగుతుందని ఆశిస్తున్నామన్నారాయన. అలాగే అక్రమ మద్యం అమ్మకాలు కూడా కంట్రోల్ అవుతాయని అన్నారు.

ప్రతి 2 గంటలకు రెండున్నర లక్షలు

ప్రస్తుతం యూపీలో హోటళ్లు, రెస్టారెంట్లలో అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం సర్వ్ చేసేందుకు అవకాశం ఉంది. అయితే కొత్త పాలసీ ప్రకారం అదనపు సమయం లిక్కర్ అమ్మాలనుకుంటే ప్రతి రెండు గంటలకు రెండున్నర లక్షల రూపాయలు ప్రభుత్వానికి కట్టాలి. అంటే అర్ధరాత్రి 2 గంటల వరకు లిక్కర్ సర్వ్ చేయాలనుకుంటే లైసెన్స్ ఫీజుకు అదనంగా మరో రూ.2.5 లక్షలు చెల్లించాలి. అదే తెల్లవారు జామున 4 గంటల వరకు అనుమతి కావాలంటే రూ.5 లక్షలు ఎక్స్‌ట్రా కట్టాలి. ఈ పాలసీని తొలుత లక్నో, మీరట్, మొరాదాబాద్, నోయిడా, ఆగ్రా లాంటి సిటీల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశం ఉంది.

More News:

8 ఏళ్ల పిల్లాడిని అడిగినా చెడు జరిగిందని చెబుతాడు

తస్మాత్ జాగ్రత్త: వీటి కోసం గూగుల్‌లో సెర్చ్ చేయొద్దు

నిర్భయ దోషిపై జైలులో రేప్!

నిర్భయ దోషుల ఉరి లైవ్ టెలికాస్ట్ చేయండి: కేంద్రానికి ఎన్జీవో లేఖ