మరో కొత్త గ్రహాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

మరో కొత్త గ్రహాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

బెల్జియంలోని లీజ్​ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని స్పెకులోస్​(సర్చ్​ ఫర్​ ప్లానెట్స్​ ఎక్లిప్సింగ్​ అల్ట్రా కూల్​ స్టార్స్) ప్రాజెక్ట్​ బృందం, బర్మింగ్​హామ్, కేంబ్రిడ్జ్, బెర్న, మసాచుసెట్స్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ విశ్వవిద్యాలయాల సహకారంతో ఉత్తర చిలీలోని అటకామా ఎడారిలో ఉన్న అబ్జర్వేటరీని ఉపయోగించి స్పెకులోస్​–3బీ అనే గ్రహాన్ని కనుగొన్నారు. ఈ గ్రహం భూమికి 55 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అతి చల్లగా ఉండే ఎర్రని మరుగుజ్జు నక్షత్రం కక్ష్యలో చుట్టూ తిరుగుతోందని గుర్తించారు. ఈ ఎర్రని మరుగుజ్జు నక్షత్రం పరిమాణంలో బృహస్పతిని పోలి ఉన్నా సూర్యుడి కంటే 100 రెట్లు మసకబారిన కాంతిని విడుదల చేస్తుంది. అలాగే, సూర్యుడి ఉష్ణోగ్రతలో సగం ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. స్పెక్యులోస్​ –3బి దాని సూర్యుడి నుంచి అధిక స్థాయిలో రేడియేషన్​ను పొందుతుంది.