విజయ్ దేవరకొండ ఖుషీ నుంచి కొత్త పోస్టర్

విజయ్ దేవరకొండ ఖుషీ నుంచి కొత్త పోస్టర్

విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ రూపొందిస్తున్న  చిత్రం ‘ఖుషి’. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ  నిర్మిస్తోంది. కిందటేడాది క్రిస్మస్‌‌కే సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ సమంత హెల్త్ ఇష్యూస్‌‌తో షూటింగ్‌‌కి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇటీవల తిరిగి మొదలుపెట్టిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో గురువారం ఈ మూవీ రిలీజ్‌‌ డేట్‌‌ని అనౌన్స్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని కొత్త పోస్టర్‌‌‌‌తో ప్రకటించారు.

ఇందులో నీట్‌‌గా టక్ చేసుకుని, చేతిలో లంచ్ బాక్స్‌‌తో విజయ్ ఆఫీసుకు వెళ్తుంటే.. చేతిలో చిన్న కుక్క పిల్లతో  విజయ్‌‌ చేతిలో చేయి వేసి తనకు టాటా చెబుతున్నట్టుగా ఉంది సమంత.  కాశ్మీర్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో జరిగే ఈ లవ్‌‌ స్టోరీలో విజయ్, సమంత మధ్య కెమిస్ట్రీ ప్రతి ఒక్కరి హార్ట్‌‌ను టచ్ చేసేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సినిమాని విడుదల చేయబోతున్నారు. జయరాం, సచిన్ ఖేడ్కర్,  మురళీ శర్మ, రోహిణి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.