కొత్త Redmi Note 13 సిరీస్ సెప్టెంబర్ 21న ప్రారంభం

కొత్త Redmi Note 13 సిరీస్ సెప్టెంబర్ 21న ప్రారంభం

Redmi  మొబైల్ ఇష్టపడేవారికి గుడ్ న్యూస్.. Xiaomi త్వరలో Redmi Note 13 సిరీస్  ఆవిష్కరించనుంది.  సెప్టెంబర్ 21న రెడ్‌మీ నోట్ 13 (Redmi Note 13) తోపాటు రెడ్‌మీ నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro), రెడ్‌మీ నోట్ 13ప్రో + (Redmi Note 13 Pro +) ఫోన్లు కూడా  చైనా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. Redmi Note 13 series హ్యాండ్ సెట్ల వివరాలు, డిజైన్లను విడుదల చేసింది. 

రెడ్‌మీ నోట్ 12 ప్రో+ (Redmi Note 12 Pro +) లో మాదిరిగానే రెడ్‌మీ నోట్ 13ప్రో+ (Redmi Note 13Pro +) ఫోన్‌లో కూడా 200 మెగా పిక్సెల్ శాంసంగ్ ఐఎస్ఓసెల్ హెచ్పీ3 డిస్కవరీ ఎడిషన్ సెన్సర్ కెమెరాతో వస్తుందని ధ్రువీకరించారు. ఇంకా 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ సెన్సర్, 2-మెగా పిక్సెల్ మాక్రో కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ప్రంట్ కెమెరా సెన్సర్ వస్తుంది.

రెడ్‌మీ నోట్ 13 ప్రో, రెడ్‌మీ నోట్ 13ప్రో + ఫోన్లు 6.67 -అంగుళాల ఓలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తున్నాయి. రెడ్ మీ నోట్ 13 ప్రో ఫోన్ 16 జీబీ ర్యామ్ కెపాసిటీతో అందుబాటులోకి వస్తుంది. రెడ్‌మీ నోట్ 13 ప్రో ఫోన్ 5020 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, రెడ్‌మీ నోట్ 13ప్రో + ఫోన్ 4880 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో అందుబాటులోకి రానున్నాయి.