మరింత కొత్తగా.. యూజర్ల ఎమోషన్స్ ను బట్టి గేమ్ లెవల్స్

మరింత కొత్తగా.. యూజర్ల ఎమోషన్స్ ను బట్టి గేమ్ లెవల్స్

వీడియో గేమ్స్ ఆడేటప్పుడు కాస్త ఛాలెంజింగ్, ఇంకాస్త ఫన్ గా అనిపించాలి. అలా కాకుండా ప్లేయర్ ఎంత ప్రయత్నించినా నెక్స్ట్ లెవల్కు వెళ్లలేకపోతుంటే ఆ గేమ్ ఇంట్రెస్ట్ పోతుంది. అలాగని గేమ్ మరీ ఈజీగా ఉన్నా ఎవరికీ నచ్చదు. అందుకే యూజర్ల ఎమోషన్స్ను బట్టి గేమ్ లెవల్స్ మారేలా సరికొత్త ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) గేమింగ్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. సైంటిస్టులు.

ALSO READ: చదువులో ఫెయిల్.. హెలికాప్టర్ తయారీలో సక్సెస్

ఆడుతున్న గేమ్ పై ఇంట్రెస్ట్ పోకుండా ఉండేందుకు గేమ్ డెవలపర్స్ ఇప్పటివరకూ 'డైనమిక్ డిఫికల్టీ అడ్జస్ట్మెంట్ ' అనే టెక్నాలజీని ఉపయోగించేవాళ్లు. ఇది ప్లేయర్ పర్ఫార్మెన్సును బేస్ చేసుకుని గేమ్ లెవల్స్, స్టేజ్లను సర్దుబాటు చేస్తుంది. అయితే ఇది ప్లేయర్ పనితీరుని పరిగణిస్తుందే తప్ప ఎమోషను న్ను తెలుసుకోలేదు. కానీ కొరియాలోని గ్వాంగు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైంటిస్టులు డెవలప్ చేస్తున్న సరికొత్త ఏఐ గేమింగ్ టెక్నాలజీ.. ప్లేయర్ ఎమోషన్ను బట్టి లెవల్స్ లో మార్పులు చేస్తుంది. ఉదాహరణకు ఫైటింగ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు. ప్లేయర్ ఎగ్జిట్ అవుతుంటే.. ఏఐ ఆ విషయాన్ని గమనించి, ఆ ఎగ్జిట్ మెంట్ అలాగే ఉండేలా గేమ్ లెవలు అడ్జస్ట్ చేస్తుంది. ఒకవేళ లెవల్ కంప్లీట్ చేయలేక ప్లేయర్కు విసుగుపుడితే.. ఏఐదాన్ని పసిగట్టి, గేమ్ లెవలు ఈజీ చేస్తుంది. అంటే ఫ్యూచర్ ప్లేయర్ ఎమోషన్స్ బట్టి గేమింగ్ ఎక్స్ పీరియెన్స్ మారుతుంటుందన్న మాట. అయితే ఈ టెక్నాలజీ సింగిల్ ప్లేయర్ గేమ్స్క మాత్రమే వర్తిస్తుంది. రియల్ టైం మల్టీ ప్లేయర్ గేమ్స్ కు వర్తించదు.