చదువులో ఫెయిల్.. హెలికాప్టర్ తయారీలో సక్సెస్

చదువులో ఫెయిల్.. హెలికాప్టర్ తయారీలో సక్సెస్

ముప్పై ఎనిమిదేళ్ల రెజాల్ చిన్నప్పుడు అయిదో తరగతి ఫెయిల్ అయ్యాడు. చదువు అబ్బలేదని అందరూ వెక్కిరించారు. దాంతో చదువు మధ్యలోనే వదిలేశాడు. 'చదువుకోకపోయినా ఫర్వాలేదు, అందరికీ గుర్తుండేలా ఏదైనా చేయమ'ని వాళ్ల నాన్న చెప్పిన మాటలు బలంగా అతని మనసును తాకాయి. అందుకే ఐదేళ్ల పాటు కష్టపడి హెలికాప్టర్ తయారుచేశాడు.

ALSO READ: మరింత కొత్తగా.. యూజర్ల ఎమోషన్స్ ను బట్టి గేమ్ లెవల్స్

బెంగాల్ లోని బర్ధమాన్ జిల్లా ఘోలా ప్రాంతానికి చెందిన రెల్ షేక్.. చదువు అబ్బకపోవడంతో కార్ మెకానిక్గా మారాడు. కొంతకాలానికి సొంతంగా ప్రొక్లెయినర్ కొనుక్కున్నాడు. లైఫ్ అంతా బాగానే ఉంది. కానీ తన తండ్రి కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. అందుకే తండ్రి కోరిక తీర్చేందుకు ఒక హెలికాప్టర్ తయారు చేయాలనుకున్నాడు.దానికోసం ఐదేండ్లు రీసెర్చ్ చేసి, సుమారు రూ. 30 లక్షలు ఖర్చు చేశాడు. కోలకతా, పానాగఢ్ నుంచి హెలికాప్టర్ ముడి పరికరాలు, కర్ణాటక నుంచి ఇంజన్ సేకరించాడు. ఎవరి సాయం తీసుకోకుండా ఒక్కడే ఎంతో కష్టపడి 40 అడుగుల భారీ హెలికాప్టర్ను రెడీ చేశాడు. ఇందులో పైలట్ తో సహా ఐదుగురు కూర్చోవచ్చు. అయితే అది ప్రయాణికుల కోసం కంటే భారీ వస్తువుల రవాణాకే బాగా పనికొస్తుందని చెప్తున్నాడు రెజల్. మరో ఆరు నెలల్లో హెలికాప్టర్ ఆకాశంలోకి ఎగిరేందుకు అనుమతులు వస్తాయని అంటున్నాడు. రెజాల్ టాలెంట్ ను చూసి ఆ ఊరి వాళ్లతో పాటు, ఎమ్మెల్యే కూడా మెచ్చుకున్నాడు.