OTT Movies : కిడ్నాప్‌‌‌‌‌‌‌‌ చేసిందెవరు?

OTT Movies : కిడ్నాప్‌‌‌‌‌‌‌‌ చేసిందెవరు?

 కిడ్నాప్‌‌‌‌‌‌‌‌ చేసిందెవరు?  

టైటిల్‌‌‌‌‌‌‌‌: ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ అలమేలమ్మ 
డైరెక్షన్​ : సుని
కాస్ట్‌‌‌‌‌‌‌‌ : శ్రద్ధ శ్రీనాథ్‌‌‌‌‌‌‌‌, రిషి, రాజేష్​, అరుణ బాల్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌, శీలం ఎం స్వామి
లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌ : కన్నడ, ఫ్లాట్‌‌‌‌‌‌‌‌ఫాం : ఆహా

పరమేశ్ (రిషి) ఓ అనాథ.  బెంగళూరులో ఉంటాడు. తనకంటూ ఎవరూ లేకపోవడంతో లోన్లీగా ఫీలవుతుంటాడు.  ఓ కూరగాయల మార్కెట్​లో పనిచేస్తూ కాలం వెళ్లదీస్తుంటాడు. పెండ్లి చేసుకోవడానికి ఎవరూ పిల్లను ఇవ్వరని బాధపడుతుంటాడు. పరమేశ్​కు లగ్జరీ లైఫ్‌‌‌‌‌‌‌‌ గడపాలని, బ్రాండెండ్ వస్తువులను వాడాలనే కోరిక కూడా ఉంటుంది. వాస్తవానికి ఆ కోరిక వల్లే అతను చిక్కుల్లో పడతాడు. అలాంటి పరమేశ్​ జీవితంలోకి అనన్య (శ్రద్ధా శ్రీనాథ్‌‌‌‌‌‌‌‌) వస్తుంది.

ఆమె ఒక బట్టల షాపులో పరిచయం అవుతుంది. ఆమెను అదే పనిగా ఫాలో అవుతుంటాడు పరమేశ్​. చివరికి ప్రేమలో పడేస్తాడు. ఒక స్కూల్లో టీచర్​గా పనిచేస్తుంటుందామె. వాళ్ల కుటుంబానికి ఆమె తెచ్చే జీతమే ఆధారం. దాంతోనే ఇల్లు గడుస్తుంది. అనన్య తల్లి అనారోగ్యంతో బాధపడుతుంటుంది. అందుకే హాస్పిటల్ ఖర్చులు భరించలేక సతమతమవుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఉన్న అనన్య ఇబ్బందులు తీరుస్తాడు ఓ డబ్బున్న వ్యక్తి. దాంతో తల్లి కోసం అతన్ని పెండ్లి చేసుకోవాలి అనుకుంటుంది అనన్య.

ఇదిలా ఉండగా.. అనన్య పనిచేసే స్కూల్‌‌‌‌‌‌‌‌లో చదువుతున్న బిజినెస్‌‌‌‌‌‌‌‌మెన్ కెన‌‌‌‌‌‌‌‌డీ కొడుకు జాన్‌‌‌‌‌‌‌‌ కిడ్నాప్ అవుతాడు. ఆ నేరం చేసింది ప‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌మేష్ అనే అనుమానంతో పోలీసులు అత‌‌‌‌‌‌‌‌డిని అరెస్ట్ చేస్తారు. ఆ కిడ్నాప్ చేయ‌‌‌‌‌‌‌‌లేద‌‌‌‌‌‌‌‌ని ప‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌మేష్ ఎంత‌‌‌‌‌‌‌‌ చెప్పినా పోలీసులు వినిపించుకోరు. పైగా కిడ్నాప‌‌‌‌‌‌‌‌ర్ ఫోన్ చేసిన ప్రతిసారి ప‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌మేష్ త‌‌‌‌‌‌‌‌న మ‌‌‌‌‌‌‌‌నిషే అని చెప్తుంటాడు. అస‌‌‌‌‌‌‌‌లు ఆ కిడ్నాప్ చేసింది ఎవ‌‌‌‌‌‌‌‌రు? ప‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌మేష్‌‌‌‌‌‌‌‌, అన‌‌‌‌‌‌‌‌న్య  ఒక్కటయ్యారా? కిడ్నాప్ డ్రామా అయినా.. కొన్ని సీన్లు ఇంట్రెస్టింగ్‌‌‌‌‌‌‌‌గా ఉండవు. 

 ఆపరేషన్ బుద్ధ

టైటిల్‌‌: పారంపోరుల్‌‌, 
డైరెక్షన్​ : అరవింద్‌‌రాజ్‌‌
కాస్ట్‌‌ : అమితాష్‌‌ ప్రధాన్‌‌, శరత్‌‌ కుమార్‌‌‌‌, కాశ్మీరా పరదేశి, బాల్‌‌రాజ్‌‌ శక్తివేల్‌‌, టి. శివ
లాంగ్వేజ్‌‌ : తమిళం, ఫ్లాట్‌‌ఫాం : ఆహా

సినిమా మొదలవగానే.. అక్రమ విగ్రహాల వ్యాపారం గురించి చూపిస్తారు. ఆ తర్వాత మైత్రేయన్ (శరత్ కుమార్) అనే పోలీసును చూపిప్తారు. అతను అవినీతి పరుడైన పోలీస్‌‌. డాగా డబ్బు సంపాదించాలనే కోరికతో ఉంటాడు. ఆ కోరికే అతన్ని విగ్రహాల వ్యాపారంలోకి దిగేలా చేస్తుంది. దానివల్లే అతని వైవాహిక బంధంలో సమస్యలు వస్తాయి. అలాంటి మైత్రేయన్ ఇంటికి ఆది (అమితాష్ ప్రధాన్) దొంగతనం చేయడానికి వచ్చి, మైత్రేయన్‌‌కి పట్టుపడతాడు. వాస్తవానికి ఆది దొంగ కాదు. కానీ.. అతని చెల్లెలు అనారోగ్యంతో బాధపడుతుంటుంది. ఆమెకు ట్రీట్‌‌మెంట్‌‌ చేయించడానికి దొంగతనం చేస్తాడు.

అయితే.. ఆది అవసరం తెలుసుకున్న మైత్రేయన్‌‌ అతన్ని కూడా విగ్రహాల వ్యాపారంలోకి దింపుతాడు. ఆది మైత్రేయన్‌‌కి పురాతన బుద్ధ విగ్రహాన్ని అక్రమంగా అమ్మడంలో సాయం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆది.. చెల్లెల్ని కాపాడుకున్నాడా? డబ్బు సంపాదించాలనే మైత్రేయన్‌‌ కోరిక నెరవేరిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  
కథ ఎక్కడా విసుగు తెప్పించదు. శరత్‌‌ కుమార్‌‌‌‌, అమితాష్ ప్రధాన్ యాక్టింగ్‌‌ సినిమాకు బలాన్ని ఇచ్చాయి. శరత్‌‌కుమార్‌‌ది గ్రే షేడ్ పోలీసు పాత్ర. ఇక క్లైమాక్స్ సీక్వెన్స్‌‌లో ఊహించని ట్విస్ట్ ఉంటుంది. కాకపోతే.. కథ పరంగా చూస్తే ఈ ట్విస్ట్ కూడా సినిమాకు పెద్దగా అవసరం లేదనిపిస్తుంది. 

భార్య తిరిగొచ్చిందా? 

టైటిల్‌‌: కూళంగల్
డైరెక్షన్​ : వినోత్​ రాజ్‌‌
కాస్ట్‌‌ : చెల్లపండి, కరుత్తడైయాన్‌‌, ఫిలిప్‌‌ ఆరులోద్స్‌‌, భానుప్రియ, రాణియమ్మ
లాంగ్వేజ్‌‌ : తమిళం
ఫ్లాట్‌‌ఫాం : సోనీలివ్‌‌

కూళంగల్ కథ తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో మొదలవుతుంది. ఆ ఊరిలో విపరీతమైన కరువు ఉంటుంది. గణపతి అనే వ్యక్తి తాగుడుకు బానిసై ఎప్పుడూ భార్యను ఇబ్బంది పెడుతుంటాడు. దాంతో అతని భార్య పుట్టింటికి వెళ్లిపోతుంది. గణపతి కూడా తన భార్యను తిరిగి తెచ్చుకునేందుకు కొడుకుతో కలిసి బయల్దేరుతాడు. బంజరు భూముల గుండా నడుస్తూ సాగే వాళ్ల ప్రయాణమే ఈ సినిమా. చివరికి భార్య తిరిగి వచ్చిందా? తాగుడు మానుకున్నాడా? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

డైరెక్టర్‌‌‌‌కు ఇది మొదటి సినిమా అయినా.. చాలా బాగా తీశాడు. కొన్ని సీన్లు చూస్తుంటే.. ఆ బంజరు భూముల గుండా మనమే నడుస్తున్న ఫీలింగ్‌‌ వస్తుంది. తక్కువ బడ్జెట్‌‌, తక్కువ క్యారెక్టర్లతో ఈ సినిమా తీశారు. అంతేకాదు.. ఈ సినిమా 94వ అకాడమీ అవార్డ్స్‌‌లో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రానికి ఇండియన్ ఎంట్రీగా ఎంపికైంది. కానీ.. నామినేట్ కాలేదు. అయినా.. ఎన్నో అవార్డులు అందుకుంది. ఈ సినిమాను రౌడీ పిక్చర్స్ బ్యానర్‌‌పై విఘ్నేష్ శివన్, నటి నయనతార నిర్మించారు.