పాటల ప్రపంచంలో కొత్త రూటు

పాటల ప్రపంచంలో కొత్త రూటు

పాటలు పాడడం కొందరి హాబీ. మరికొందరేమో ర్యాప్​ చేస్తారు.  కొత్తగా సింగర్​, ర్యాపర్​గా కెరీర్​ మొదలుపెట్టినవాళ్ల పాటల్ని ప్రపంచం మొత్తం వినాలంటే... వాటిని స్ట్రీమింగ్ ప్లాట్​ఫామ్స్​లో అప్​లోడ్​ చేయాలి. దీంతో సొంత కంటెంట్​ని ఎవరూ కాపీ కొట్టలేరు. ఈ సేవల్ని ఫ్రీగా లేదా కొంత డబ్బు తీసుకుని అందించే ఆడియో డిస్ట్రిబ్యూషన్​ ప్లాట్​ఫామ్స్​​ చాలానే ఉన్నాయి.  వీటి ద్వారా స్పోర్టిఫై, యాపిల్ మ్యూజిక్, అమెజాన్​ ప్రైమ్​ మ్యూజిక్​లలో మ్యూజిక్​ అప్​లోడ్​ చేయొచ్చు.

అమ్యూజ్​: మేజర్​ స్ట్రీమింగ్​ ప్లాట్​ఫామ్​లో మ్యూజిక్​ అప్​లోడ్ చేయాలి అనుకునేవాళ్లకి అమ్యూజ్​​ బెస్ట్ ఛాయిస్​. ఇందులోని ప్రత్యేక యాప్​లో నిమిషాల్లోనే మ్యూజిక్​ అప్​లోడ్​ చేయొచ్చు. అందుకోసం నాలుగు వారాల ఫ్రీ ప్లాన్​ ఉంది. యూజర్లు తమ పాటలు సింగిల్స్​ లేదా ఆల్బమ్స్​ని అందులో అప్​లోడ్ చేయాలి. ఏడాదిలో 12 పాటలు రిలీజ్​ చేయొచ్చు. పాటలు బాగుంటే కొంత డబ్బు కూడా ఇస్తారు. ఇందులో అప్​గ్రేడ్​ ఆప్షన్​ కూడా ఉంది. 
డిస్ట్రోకిడ్: ఈ ప్లాట్​ఫామ్ ద్వారా కొత్తవాళ్ల సంగీతం అందరికీ వేగంగా రీచ్​ అవుతుంది. ఈ యాప్ సాయంతో స్పోర్టిఫై, అమెజాన్​ ప్రైమ్​ మ్యూజిక్​, యూట్యూబ్​, టైడాల్ వంటి వాటిల్లో మ్యూజిక్​ అప్​లోడ్​ చేయొచ్చు. ముందుగా ఏడాది ఫీజు కొంత చెల్లించాలి. పాటల రీచ్​ని బట్టి నెల నెలా కొంత డబ్బు వస్తుంది. సింగిల్​ ఆర్టిస్ట్​లు దాదాపు పదిహేనువందల రూపాయలు కట్టాలి. అదే ఇద్దరు లేదా ఐదుగురి నుంచి వంద మంది ఆర్టిస్ట్​లకి వేరే ప్లాన్స్​ ఉన్నాయి.  
ట్యున్​కోర్​: దీనిలో దాదాపు నూటయాభై డిజిటల్​ స్టోర్లలో మ్యూజిక్​ అప్​లోడ్​ చేసే వీలుంది. ఇందులో సోషల్​మీడియా ప్రమోషన్​ కూడా చేసుకోవచ్చు. ఈ ప్లాట్​ఫామ్​లో ఒక ఆల్బమ్​కి మొదటి ఏడాది రెండువేల రూపాయల పైన, మరుసటి ఏడాదిమూడువేల రూపాయలు కట్టాలి. సింగిల్​ అయితే ఎనిమిది వందలు చెల్లించాలి. అయితే ఇందులో  కట్టిన ఫీజు మొత్తం మళ్లీ చేతికొస్తుంది. 
రూట్​నోట్​: ఇందులో మ్యూజిక్​ని పదిహేను శాతం లాభాలు వచ్చేంత వరకు  ఫ్రీగా డిస్ట్రిబ్యూట్​ చేసుకోవచ్చు. రూట్​నోట్​ ప్లాన్స్​లో డైరెక్ట్​ సెల్లింగ్​ సర్వీసెస్​,  రెఫరల్ అవార్డ్స్​ ఫెసిలిటీ ఉంది. 
సీడీబేబీ: ఈ ప్లాట్​ఫామ్​ ద్వారా కూడా 150 డిజిటల్​ స్టోర్స్​లో మ్యూజిక్​ అప్​లోడ్​ చేయొచ్చు. డిజిటల్​గానే కాకుండా సీడీల ద్వారా  డిస్ట్రిబ్యూషన్​ చేసుకొనే ఫెసిలిటీ ఉంది. ఇందులో ఏడాది ఫీజు కట్టాల్సిన పనిలేదు. అయితే, సింగిల్​కి ఏడొందల యాభై, ఆల్బమ్​కి మూడువేల ఐదొందలు కట్టాలి. ఇందులో వారం వారం డబ్బు వస్తుంది.