సరిపోదా శనివారం కొత్త షెడ్యూల్ షురూ

సరిపోదా శనివారం కొత్త షెడ్యూల్ షురూ

గత కొద్దిరోజులుగా ‘హాయ్‌‌‌‌ నాన్న’ ప్రమోషన్స్‌‌‌‌తో బిజీగా ఉన్న నాని, తాజాగా తన కొత్త చిత్రం షూటింగ్‌‌‌‌లో తిరిగి జాయిన్ అయ్యాడు. అతను హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌‌‌‌. ఎస్‌‌‌‌.జె.సూర్య కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్‌‌‌‌ పూర్తయింది. బుధవారం కొత్త షెడ్యూల్‌‌‌‌ని హైదరాబాద్‌‌‌‌లో ప్రారంభించారు. 

ఈ లెంగ్తీ షెడ్యూల్‌‌‌‌లో ఇంటెన్స్‌‌‌‌ యాక్షన్‌‌‌‌ సీక్వెన్స్‌‌‌‌తో పాటు కొంత టాకీ పార్ట్‌‌‌‌ను చిత్రీకరించనున్నారు. నానితో పాటు ముఖ్య నటీనటులంతా ఇందులో పాల్గొంటారు. ఈ యాక్షన్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌ను డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి కలిసి హై బడ్జెట్‌‌‌‌తో నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది