సుధీర్ బాబు హీరోగా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్‌తో అభిలాష్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. ఆర్ణ హీరోయిన్. సుధీర్ బాబు తండ్రి పాత్రను సాయాజీ షిండే పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. గురువారం ఈ చిత్రం నుంచి మరో పాటను రిలీజ్ చేశారు.
‘అనగనగా అంటూ ఓ కథ చెబుతాను వినరా బ్రదరూ. నేను చెప్పే కథలో మా నాన్న హీరోలే.. మాటల్లో కొంచెం కరుకే కానీ ఆ మనసే ముత్యం.. అందుకనే కదరా నాకిష్టం మా నాన్నే..’ అంటూ తండ్రీకొడుకుల మధ్య ఉండే బాండింగ్‌ను చూపిస్తూ సాగిన పాట ఆకట్టుకుంది. జై క్రిష్ కంపోజ్ చేసిన ఈ పాటకు లక్ష్మీ ప్రియాంక అందమైన లిరిక్స్ అందించగా, నజీరుద్దీన్ పాడిన తీరు ఇంప్రెస్ చేస్తుంది. రాజు సందరం, శశాంక్, ఆమని ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల కానుంది.