పార్లమెంట్​ స్టాఫ్​కు కొత్త యూనిఫాం

 పార్లమెంట్​ స్టాఫ్​కు కొత్త యూనిఫాం

వినాయక చవితికి కొత్త బిల్డింగ్​లో సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంట్​ప్రత్యేక సెషన్ ఈ నెల 18 నుంచి​ ప్రారంభం కానుంది. ఆ మరుసటి రోజు నుంచి పార్లమెంట్ కొత్త​ బిల్డింగ్​లో స్పెషల్ ​సెషన్ ​కొనసాగనుంది. వినాయక చవితి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి సభ్యులు కొత్త బిల్డింగ్​లోకి ప్రవేశించనున్నారు. పార్లమెంట్ ​స్టాఫ్​ ఇకపై కొత్త యూనిఫాం ధరిస్తారు. నెహ్రూ జాకెట్స్, ఖాకీ కలర్​ ప్యాంట్లు వేసుకోనున్నారు.

ఈ యూనిఫాంను నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ఆఫ్​ ఫ్యాషన్​ టెక్నాలజీ(నిఫ్టీ) రూపొందించింది. బ్యూరోక్రాట్స్ సూట్​ను డీప్​ పింక్​ కలర్ ​నెహ్రూ జాకెట్​ భర్తీ చేయనుంది. స్టాఫ్​ షర్టులు కూడా కమలం డిజైన్​తో పింక్​కలర్​లో ఉండనున్నాయి. మార్షల్స్ మణిపురి తలపాగాలు ధరించనున్నారు. పార్లమెంట్​బిల్డింగ్​ సెక్యూరిటీ సిబ్బంది సఫారీ సూట్లకు బదులు మిలిటరీ మాదిరి డ్రెస్ ​వేసుకుంటారు