సింగరేణి కార్మికులకు జులైలో కొత్త వేతనాలు 

సింగరేణి కార్మికులకు జులైలో కొత్త వేతనాలు 

కోల్​బెల్ట్​, వెలుగు:  11వ వేజ్​బోర్డు అగ్రిమెంట్ ద్వారా సింగరేణిలో జూన్​ నుంచి కొత్త వేతనాలు వర్తింపజేయాలని గురువారం కోలిండియా మేనేజ్​మెంట్​ ఉత్తర్వులు జారీ చేసిందని బీఎంఎస్​ నేషనల్​ లీడర్​, బొగ్గు పరిశ్రమల ఇన్ చార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి, సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్(బీఎంఎస్) స్టేట్​ ప్రెసిడెంట్​ యాదగిరి సత్తయ్య తెలిపారు.

జేబీసీసీఐ అగ్రిమెంట్‌‌‌‌లో బీఎంఎస్ యూనియన్​ పెద్దన్న పాత్ర పోషించి ఒప్పందం చేయడానికి కృషి చేసిందన్నారు. కోలిండియా మాదిరిగా సింగరేణిలో కూడా జూన్ నుంచి కొత్త జీతభత్యాలు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్  చేయడంతో మేనేజ్​మెంట్​ స్పందించిందన్నారు. సింగరేణి కార్మికులు కొత్త జీతాలు జులైలో అందుకుంటారని తెలిపారు.