హైదరాబాద్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ షురూ

హైదరాబాద్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ షురూ

హైదరాబాద్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. యువత ఈవెంట్స్ లలో జాయిన్ అయ్యేందుకు బయల్దేరారు. నూతన సంవత్సరాన్ని గ్రాండ్ గా స్వాగతం పలికేందుకు వెరైటీ కేక్స్ ను సిద్ధం చేసుకుంటున్నారు. ఇక బార్లు, వైన్ షాప్స్ ముందు జనం బారులు తీరారు. పాత ఏడాదికి గుడ్ బై చెప్పి..కొత్త ఏడాదికి వెల్ కమ్ చెప్పేందుకు రెడీ అయ్యారు. పబ్స్, రిసార్ట్స్, ఈవెంట్లలో ఏర్పాటు చేసే న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనేందుకు యువత ఉత్సాహం చూపిస్తోంది. రోడ్లపైకి వాహనాలు భారీగా చేరడంతో నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడం పోలీసులు కష్టంగా మారుతోంది.

మరోవైపు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే తాటతీస్తామని హెచ్చరిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. కస్టమర్స్ను ఆకట్టుకునేలా వివిధ రకాల కేక్స్ ను తయారు చేస్తున్నారు బేకరి నిర్వాహకులు. 12 గంటలకు కేక్స్ కట్ చేసేందుకు యువత ఆసక్తి చూపిస్తోంది.