న్యూజిలాండ్ క్రికెట్ టీమ్కు భారీ షాక్

న్యూజిలాండ్ క్రికెట్ టీమ్కు  భారీ షాక్

గాయంతో ఐపీఎల్ 2023 సీజన్కు దూరమైన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వన్డే వరల్డ్ కప్కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోకాలి గాయంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న కేన్ విలియమ్సన్కు సర్జరీ చేయాల్సిందని డాక్టర్లు తెలపడంతో..భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్లో అతడు ఆడేది అనుమానంగా మారింది. 

వరల్డ్ కప్లో ఆడటం కష్టమే..

చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ లో  గాయపడ్డ  కేన్ కు స్కానింగ్ నిర్వహించారు. అయితే అతడి  కుడి మోకాలి ఎముక ఛిద్రం అయినట్టు స్కానింగ్లో తేలింది. దీంతో  శస్త్ర చికిత్స అవసరమని డాక్టర్లు తేల్చడంతో..కేన్ విలియమ్సన్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ ప్రక్రియ  జరగడానికి కనీసం 6  నుంచి 7  నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో  అక్టోబర్ నుంచి భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో  కేన్ విలియమ్సన్ ఆడటం అనుమానంగా మారింది. ఈ విషయాన్ని  బ్లాక్ క్యాప్స్ ట్విటర్లో పోస్ట్ చేసింది. 

న్యూజిలాండ్ లో ఎదురుదెబ్బ..

కేన్ విలియమ్సన్కు ఆపరేషన్ జరిగితే అతడు కోలుకోవడానికి కనీసం 6 నెలలు సమయం పడుతుంది. సర్జరీ నుంచి కోలుకున్నా ఫిట్ నెస్ నిరూపించుకుని మైదానంలో అడుగుపెట్టాలంటే మరో 2 రెండు నెలల సమయం పడుతుంది. దీంతో అక్టోబర్ లో జరిగే  వన్డే వరల్డ్ కప్లో అతడు ఆడే ఛాన్స్ తక్కువే.  ఇది న్యూజిలాండ్కు పెద్ద ఎదురుదెబ్బ. 

గాయం ఎలా అయింది ...

ఐపీఎల్ 2023లో భాగంగా  మార్చి 31న అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య  తొలి మ్యాచ్ జరిగింది. ఇందులో చెన్నై  ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్  స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు.  బౌండరీ లైన్ దగ్గర ఉన్న కేన్ విలియమ్సన్..గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే  అదుపు తప్పి బౌండరీ లైన్ అవతల పడ్డాడు. కింద పడే క్రమంలో అతడి కాలు  నేలకు బలంగా తాకింది.  దీంతో  హుటాహుటిన  కేన్ మామను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత  న్యూజిలాండ్ కు వెళ్లిపోయాడు.