సెమీస్ లో న్యూజిలాండ్

సెమీస్ లో న్యూజిలాండ్

టీ20 ప్రపంచ కప్ 2022లో సెమీస్ కి వెళ్లిన మొదటి జట్టు న్యూజిలాండ్. ఐర్లాండ్ ని    35 పరుగుల తేడాతో ఓడించి గ్రూప్ ఎ నుంచి న్యూజిలాండ్ సెమీస్ లోకి అడుగు పెట్టింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లు జాషువా లిటిల్ 3, గారెత్ డెలానీ 2 వికేట్లు తీసుకున్నారు.
న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాటర్లు ఫిన్ అలెన్ (32), డెవాన్ కాన్వే (28) జట్టుకి శుభారంబాన్ని ఇచ్చారు. తరువాత వన్ డౌన్ లో వచ్చిన కేన్ విలియమ్సన్ కేప్టెన్ ఇన్నింగ్స్ (35 బాల్స్ లో 61 పరుగులు, 5 ఫోర్లు, 3 సిక్సర్లు)కి తోడుగా డారిల్ మిచెల్(31) తోడవడంతో న్యూజిలాండ్ 185 పరుగులు చేసింది.

186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టు ఓపెనర్లు న్యూజిలాండ్ కి గట్టి పోటీనే ఇచ్చారు. పాల్ స్టిర్లింగ్ (27 బాల్స్ లో 37 పరుగులు) కేప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ (25 బాల్స్ లో 30 పరుగులు) చక్కని ఇన్నింగ్స్ ఆడారు. కానీ, వీళ్ల తరువాత వచ్చిన బ్యాటర్లలో జార్జ్ డాక్రెల్ (23) తప్ప మిగిలిన బ్యాటర్లెవరూ న్యూజిలాండ్ కి పోటీ ఇవ్వలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్లు లాకీ ఫెర్గూసన్ 3,
మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌతీ చెరో 2 వికెట్లు తీసుకొని ఐర్లాండ్ ని 150 పరుగులకి కట్టడి చేశారు. 5 మ్యాచ్ ల్లో కేవలం ఒకటి మాత్రమే గెలిచిన ఐర్లాండ్ ఇంటి దారి పట్టింది. 61 పరుగులు చేసి కేప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కేన్ విలియమ్సన్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.