5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కివీస్

 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కివీస్

రాయ్పూర్  వేదికగా ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య  జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో స్వల్ప వ్యవధిలో  5 వికెట్లను కోల్పోయి కివీస్ జట్టు కష్టాల్లో పడింది. భారత బౌలర్ల దెబ్బకు కివీస్‌ టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. 13 ఓవర్లు ముగిసే టైమ్ కు కివీస్ 5 వికెట్ల నష్టానికి 30 పరుగులు మాత్రమే చేసింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ (8), మైకెల్‌ బ్రాస్‌వెల్ (4) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 2 వికెట్లు తీయగా సిరాజ్, ఠాకూర్, పాండ్య చెరో వికెట్ తీశారు. అంతకు ముందు భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.