IND vs NZ Live Updates : 90 రన్స్ తేడాతో టీమిండియా విక్టరీ

IND vs NZ Live Updates  :  90 రన్స్ తేడాతో టీమిండియా విక్టరీ

90 పరుగుల తేడాతో భారత్ గెలుపు

న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో భారత్ 90 పరుగులతో విజయం సాధించింది. 386 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 41.2  ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది. 

 

9వ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

చివరి వన్డేలో న్యూజిలాండ్ 9వ వికెట్ కోల్పోయింది. 280  పరుగుల వద్ద జాకబ్ డఫ్పీ  (0) ఔటయ్యాడు. చాహల్ బౌలింగ్ లో LBWగా వెనుదిరిగాడు.   దీంతో  ప్రస్తుతం న్యూజిలాండ్ 40  ఓవర్లలో 9 వికెట్లకు 280 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది.  క్రీజులో సాంట్నర్ (19) పరుగులతో, టిక్నర్ (0) పరుగులతో ఉన్నారు. 

8వ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

చివరి వన్డేలో న్యూజిలాండ్ 8వ వికెట్ కోల్పోయింది. 279  పరుగుల వద్ద ఫెర్గ్యూసన్  (7) ఔటయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో రోహిత్ వర్మకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు.  దీంతో  ప్రస్తుతం న్యూజిలాండ్ 39  ఓవర్లలో 8 వికెట్లకు 279 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది.  క్రీజులో సాంట్నర్ (18) పరుగులతో,  జాకబ్ డఫ్ఫీ  (0) పరుగులతో ఉన్నారు. 

7వ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్


చివరి వన్డేలో న్యూజిలాండ్ 7వ వికెట్ కోల్పోయింది. 269  పరుగుల వద్ద బ్రేస్ వెల్ (26) ఔటయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో బ్రేస్ వెల్ స్టంప్ ఔటయ్యాడు. దీంతో  ప్రస్తుతం న్యూజిలాండ్ 38.2 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది.  క్రీజులో సాంట్నర్ (18) పరుగులతో, ఫెర్గ్యూసన్  (5) పరుగులతో ఉన్నారు. 

6వ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

386 పరుగుల ఛేజింగ్ లో న్యూజిలాండ్ వరుసగా వికెట్లు కోల్పోతుంది. తాజాగా ఆ జట్టు ఆరో వికెట్ నష్టపోయింది. 230 పరుగుల వద్ద  డివాన్ కాన్వే (138) ఔటయ్యాడు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. దీంతో  ప్రస్తుతం న్యూజిలాండ్ 32 ఓవర్లలో 6 వికెట్లకు 230 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది.  క్రీజులో సాంట్నర్ (0) పరుగులతో, బ్రేస్ వెల్ (8) పరుగులతో ఉన్నారు. 

5వ వికెట్ కోల్పోయిన కివీస్

చివరి వన్డేలో న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 200 పరుగుల వద్ద గ్లెన్ ఫిలిప్స్ (5) ఔటయ్యాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ 28.2 ఓవర్లలో 5 వికెట్లకు 206 పరుగులు చేసింది. క్రీజులో కాన్వే (125) పరుగులతో, బ్రేస్ వెల్ (0) పరుగులతో ఉన్నారు. 
 

184 పరుగులకే 4 వికెట్లు డౌన్

386 పరుగుల టార్గెట్ ఛేజింగ్ లో న్యూజిలాండ్ 4వ వికెట్ కోల్పోయింది. 184 పరుగుల వద్ద కెప్టెన్ టామ్ లాథమ్ వికెట్ ను నష్టపోయింది. డారెల్ మిచెల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన లాథమ్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం కివీస్  184 పరుగులతో ఆడుతోంది.  ఆ జట్టు విజయానికి 24.2 ఓవర్లలో 201 రన్స్ కావాలి. 

రెండో వికెట్ కోల్పోయిన కివీస్

న్యూజిలాండ్‌  రెండో వికెట్ కోల్పోయింది. కివీస్ ఓపెనర్ నికోల్స్‌ (42) ఔటయ్యాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన 15 వ ఓవర్లో అతను ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం కివీస్ 16  ఓవర్లకు గానూ రెండు వికెట్లను కోల్పోయి 112 పరుగులు చేసింది. 

తొలి వికెట్ డౌన్ : న్యూజిలాండ్ స్కోరు 6/1

చివరి వన్డేలో న్యూజిలాండ్ పరుగుల ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఫిన్ అలెన్ ను హార్దిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో కివీస్  సున్నా వద్దే ఫస్ట్ వికెట్ నష్టపోయింది.  ప్రస్తుతం కాన్వే (1), నికోలస్ (1) పరుగులతో క్రీజులో ఉన్నారు 
 

 

న్యూజిలాండ్ టార్గెట్ 386 పరుగులు

చివరి వన్డేలో టీమిండియా దుమ్ము రేపింది. న్యూజిలాండ్ కు 386 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన  భారత్ 50 ఓవర్లలో 9 ఓవర్లలో 385 పరుగులు సాధించింది. 

వాషింగ్టన్ సుందర్ (9) ఔట్

మూడో వన్డేలో వాషింగ్టన్ సుందర్ (9) ఔటయ్యాడు. 313 పరుగుల వద్ద టిక్నర్ బౌలింగ్ లో సుందర్ పెవీలియన్ చేరాడు.   దీంతో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా (16), శార్దూల్ ఠాకూర్  (6 ) పరుగులతో క్రీజులో ఉన్నారు.


సూర్యకుమార్ యాదవ్ (14) ఔట్

మూడో వన్డేలో  సూర్యకుమార్ యాదవ్ (14) ఔటయ్యాడు. 293 పరుగుల వద్ద జాకబ్ డఫ్ఫీ బౌలింగ్ లో సూర్య పెవీలియన్ చేరాడు.   దీంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా (14), సుందర్ (9 ) పరుగులతో క్రీజులో ఉన్నారు.

 

కోహ్లీ (36) ఔట్ భారత్ స్కోరు 285/4

మూడో వన్డేలో  విరాట్ కోహ్లీ (36) ఔటయ్యాడు. 284 పరుగుల వద్ద జాకబ్ డఫ్ఫీ బౌలింగ్ లో కోహ్లీ ఫిన్ అలెన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.   దీంతో భారత్  నాల్గో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా (1), సూర్య (8 ) పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఇషాన్ కిషన్ (17) ఔట్

మూడో వన్డేలో ఇషాన్ కిషన్ (17) ఔటయ్యాడు. 268 పరుగుల వద్ద  ఇషాన్ కిషన్ రనౌట్ అయ్యాడు. దీంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (33), సూర్య (0 ) పరుగులతో క్రీజులో ఉన్నారు.
 

శుభ్ మన్ గిల్ (112) ఔట్

చివరి వన్డేలో  సెంచరీతో చెలరేగిన శుభ్ మన్ గిల్ (112) ఔటయ్యాడు. టిక్నర్ బౌలింగ్ లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ లో గిల్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. న్యూజిలాండ్ బౌలర్లను చితక్కొట్టాడు. 13 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. మొత్తంగా 78 బంతుల్లో 112 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో భారత్ 230 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 
 

రోహిత్ శర్మ (101)ఔట్

న్యూజిలాండ్ వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. కేవలం 85 బంతుల్లో 9 ఫోర్లు,6 సిక్సర్లతో శతకం బాదాడు. రోహిత్ శర్మ  మూడేళ్ల తర్వాత సెంచరీ బాదడం విశేషం. సెంచరీ చేసిన అనంతరం  రోహిత్ శర్మ (101) ఔటయ్యాడు. టిక్నర్‌ బౌలింగ్  లో బౌల్డ్ అయ్యాడు. దీంతో  భారత్ 212 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది.

 

ఓపెనర్ల సెంచరీ

200 పరుగుల భారీ భాగస్వామ్యంతో (25 ఓవర్లలోనే) ఓపెనర్లిద్దరూ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. రోహిత్ శర్మ 100 (83బంతుల్లో. 9ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్ మన్ గిల్ 100 (72 బంతుల్లో. 12ఫోర్లు, 4 సిక్సర్లు) కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. 

150 పరుగుల భాగస్వామ్యం


ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌‌‌‌ తో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచ్లో టీమిండియా ఓపెనర్లు  శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతున్నారు. ఇప్పటికే చెరో హాఫ్  సెంచరీలను  కంప్లీట్ చేసుకున్న వీరిద్దరూ 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హాఫ్  సెంచరీల తరువాత వీరిద్దరూ బౌండరీలతో విరుచుకపడుతున్నారు.   ప్రస్తుతం టీమిండియా 18 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 151 పరుగులు చేసింది. రోహిత్ (78), గిల్ (69) క్రీజులో ఉన్నారు.  
 

ఓపెనర్ల హాఫ్ సెంచరీ

శుభ్ మన్ గిల్ 33 బాంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. సాంట్నర్ వేసిన 11.2 ఓవర్లో ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అందులో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. తర్వాత రోహిత్ శర్మ కూడా సాంటర్న్ బౌలింగ్ లో (13.1 ఓవర్లో) సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే, ఇది రోహిత్ కి వన్డేల్లో 49వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.  

పవర్ ప్లేల్లో రాణిస్తున్న టీమిండియా

2023లో ఆడిన వన్డేల్లో మొదటి పవర్ ప్లేల్లో (మొదటి10 ఓవర్లు)  టీమిండియాకు శుభారంభం లభించింది. శ్రీలంకతో జరిగిన సిరీస్ లో.. గౌహతిలో 75, కోల్ కతాలో 67, త్రివేండ్రంలో 75 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తో జరిగిన వన్డేల్లో కూడా... హైదరాబాద్ లో 48, రాయ్ పూర్ లో 52, ఇండోర్ లో 82 పరుగులు రాబట్టింది.

రోహిత్ బాదుడు

జాకబ్ డఫీ వేసిన 10వ ఓవర్లో రోహిత్ శర్మ 17 పరుగులు రాబట్టాడు. ఆ ఓవర్లో రెండులు సిక్స్ లు, ఒక ఫోర్ కొట్టాడు. 

గిల్ ఎదురు దాడి

ఇన్నింగ్స్ మొదటి ఓవర్ నుంచి నిలకడగా ఆడిన గిల్ ఒక్కసారిగా గేర్ మార్చి కివీస్ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. 6.4 , 6.6  ఓవర్లో టిక్నర్ బౌలింగ్లో రెండు ఫోర్లు బాదాడు. తర్వాత ఫెర్గుసన్ బౌలింగ్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ప్రస్తుతం గిల్ (41, 29 బాల్స్ లో), రోహిత్ (22, 25 బాల్స్ లో) క్రీజ్ లో ఉన్నారు.

ఐదోవర్లకు 30 పరుగులు

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇస్తున్నారు. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌ (12*), రోహిత్ శర్మ (17*) నిలకడగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఆరు ఓవర్లు ముగిసే టైమ్ కు టీమిండియా 31 పరుగులు చేసింది. 

ఇండోర్ వేదికగా ఇండియా, న్యూజిలాండ్‌‌‌‌ జట్ల మధ్య జరుగుతోన్న  చివరి వన్డే మ్యాచ్ లో కివీస్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటికే రెండు వన్డేల్లో గెలిచి సిరీస్ గెలుచుకున్న  టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి క్లీన్‌స్వీప్‌ చేయాలని భావిస్తుంటే .. మూడో వన్డేలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని కివీస్ ఆలోచిస్తుంది. 


భారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్(వికెట్ కిపర్ ), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్


న్యూజిలాండ్:  ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కిపర్/కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్