న్యూజిలాండ్ క్రికెట్లో కరోనా కలకలం.. స్టార్ ఓపెన‌ర్‌కు పాజిటివ్

 న్యూజిలాండ్  క్రికెట్లో కరోనా కలకలం..  స్టార్ ఓపెన‌ర్‌కు పాజిటివ్

 న్యూజిలాండ్ క్రికెట్‌లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. తాజాగా ఆ జట్టు ఓపెనర్ డెవాన్ కాన్వేకు కరోనా బారిన పడ్డాడు. అతనికి కరోనా నిర్ధారణ పరీక్షలో కొవిడ్ పాజిటివ్ అని తేలింది.  ఈ విష‌యాన్ని న్యూజిలాండ్ క్రికెట్ సోష‌ల్‌మీడియా ద్వారా వెల్లడించింది.  అంతేకాకుండా...  ఆ జ‌ట్టు బౌలింగ్ కోచ్ ఆండ్రే ఆడ‌మ్ కూడా క‌రోనా బారిన ప‌డ్డాడ‌ని తెలిపింది.  

దీంతో పాకిస్థాన్ తో జరిగే నాలుగో  టీ20 మ్యాచ్ కు డెవాన్ కాన్వే దూరం కానున్నాడు. అతని స్థానంలో చాడ్ బోన్స్ జట్టులో చేరనున్నాడు.  కాన్వేను ప్రస్తుతం  క్రైస్ట్‌చర్చ్ హోటల్‌లో ఐసోలేషలన్ లో ఉంచారు.  ఇప్పటికే న్యూజిలాండ్ ఆల్ రౌండర్ మిచెల్ శాంట్నర్ కరోనా బారిన పడ్డాడు.  

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్  3-0తో ఆధిక్యంలో ఉంది. శుక్రవారం క్రిస్ట్‌చ‌ర్చ్‌లోని హ‌గ్లే ఓవ‌ల్ స్టేడియంలో నాలుగో టీ20 జ‌రుగ‌నుంది.  మిగితా రెండు మ్యాచ్ లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని పాక్ భావిస్తోంది.