
కరోనావైరస్ తీవ్రత రాష్ట్రంలో పెరుగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో గత 24 గంటల్లో 1897 కొత్త కేసులు నమోదయినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 84,544 కు చేరింది. తాజాగా మంగళవారం కరోనా బారినపడి 9 మంద చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 654 కు చేరింది. కొత్తగా 1920 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 61,294గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,596 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా మరో 15,534 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 72.49 శాతంగా ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇది భారత రికవరీ రేటు 69.79 శాతం కంటే ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో మంగళవారం 22,972 మందికి కరోనా టెస్టులు చేశారు. దాంతో మొత్తం టెస్టుల సంఖ్య 6,65,847కు చేరింది.
ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 479, మేడ్చల్ మల్కాజిగిరి 172, రంగారెడ్డి-162, సంగారెడ్డి-107, వరంగల్ అర్బన్ 87, కరీంనగర్ 64, ఖమ్మం 63, పెద్దపల్లి 62,సిద్ధిపేట 62, నల్గొండ 54 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
For More News..