IND vs NZ : సగం వికెట్లు కోల్పోయిన కివీస్

IND vs NZ : సగం వికెట్లు కోల్పోయిన కివీస్

350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ జట్టు సగం వికెట్లను కోల్పోయింది. 25 ఓవర్లకు కివీస్ 5 వికెట్లను కోల్పోయి 130 పరుగులు చేసింది. ప్రస్తుతం  మైఖేల్ బ్రాస్‌వెల్ (1), టామ్‌ లేథమ్‌ (17) క్రీజులో ఉన్నారు.  అంతకుముందు కివీస్ ఓపెనర్లు తడబడ్డారు. ఓపెనర్ డేవాన్‌ కాన్వే (10) పరుగులకే సిరాజ్ బౌలింగ్ లో వెనుదిరగగా, దూకుడగా ఆడిన మరో  ఓపెనర్ ఫిన్‌ అలెన్ (40) కూడా త్వరగానే ఔటయ్యాడు.

ఆ తరువాత  హెన్రీ నికోల్స్‌ (18), హెన్రీ నికోల్స్‌ (18), గ్లెన్‌ ఫిలిప్స్‌ (11) తక్కువ స్కోర్ కే  ఔటయ్యిరు. దీంతో  టార్గెట్ సగం ఫినిష్ చేయకముందే కివీస్  సగం వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.