ఖతర్నాక్ కివీస్.. పాక్‌‌‌‌ను ఓడించింది

ఖతర్నాక్ కివీస్.. పాక్‌‌‌‌ను ఓడించింది

హైదరాబాద్, వెలుగు: వన్డే వరల్డ్ కప్‌‌‌‌ ముంగిట పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తమ బ్యాటింగ్ పవర్ చూపెట్టాయి. స్పిన్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ రాచిన్ రవీంద్ర (16 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 97) మెరుపులతో శుక్రవారం జరిగిన వార్మప్‌‌‌‌లో కివీస్ 5 వికెట్ల తేడాతో పాక్‌‌‌‌ను ఓడించింది. టాస్ నెగ్గిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 345/5 స్కోరు చేసింది. రిజ్వాన్ (103) సెంచరీ కొట్టగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (80), సౌద్ షకీల్ (75) ఫిఫ్టీలతో రాణించారు. ఛేజింగ్‌‌‌‌లో కివీస్‌‌‌‌ 43.4 ఓవర్లలోనే 346/5 స్కోరు చేసి గెలిచింది. 

విలియమ్సన్ (54) ఫిఫ్టీతో రీఎంట్రీ ఇచ్చాడు. డారిల్ మిచెల్ (59), మార్క్ చాప్‌‌‌‌మన్ (66 నాటౌట్) కూడా సత్తా చాటారు.  మరో మ్యాచ్​లో బంగ్లాదేశ్​ 7 వికెట్ల తేడాతో శ్రీలంకకు షాకిచ్చింది.