కరీంనగర్ టౌన్,వెలుగు: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రానున్న 15 రోజులు కీలకమని, రైస్ మిల్లులలో దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్‌లో రైస్ మిల్లర్స్, ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులతో సోమవారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైస్ మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
అంతకుముందు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ చిత్రామిశ్రా పాల్గొని 185 దరఖాస్తులు స్వీకరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో మహేశ్వర్, సివిల్ సప్లైస్ ఆఫీసర్ నర్సింగరావు, మేనేజర్ రజనీకాంత్, డీఆర్డీవో శ్రీధర్, డీసీవో రామానుజాచారి, స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
