రాబోయే వారం.. 19వ తేదీ వరకు వాతావరణం ఎలా ఉండబోతుంది..!

రాబోయే వారం.. 19వ తేదీ వరకు వాతావరణం ఎలా ఉండబోతుంది..!

రాబోయే వారం రోజులు అంటే.. 2023, డిసెంబర్ 19వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో.. హైదరాబాద్ లో వాతావరణం ఎలా ఉండబోతుంది.. వర్షం పడుతుందా.. తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే వివరాలను ప్రకటించింది వాతావరణ శాఖ. 

రాబోయే వారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశం మొత్తం కూల్ వెదర్ ఉంటుంది. వాతావరణ చల్లగా ఉండటంతోపాటు.. ఎక్కడా వర్షం పడే సూచనలు లేవు. హైదరాబాద్ లో ఉష్ణోగ్రత మరింత తగ్గే అవకాశం ఉంది.. కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు.. కొన్ని ప్రాంతాల్లో పడిపోనుంది. ఆకాశం క్లియర్ గా ఉంటుంది.. మేఘాలు కూడా ఉండవు. డిసెంబర్ 19వ తేదీ వరకు అసలు హైదరాబాద్, తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ లోనూ వర్ష సూచనలు అస్సలు లేవు..

ఇక సముద్రంలో తుఫాన్ లు పడే సూచనలు ఉన్నాయా అంటే.. వచ్చే వారం రోజులు అలాంటి సూచనలు ఏమీ లేవని ప్రకటించింది వాతావరణ శాఖ. ఇటీవలే మిగ్ జాన్ తుఫాన్ తో ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మళ్లీ తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలను కొట్టిపారేసింది తుఫాన్ హెచ్చరికలు విభాగం. ప్రస్తుతం మాల్ దీవ్స్ దగ్గర ఉపరితల ఆవర్తనం ఉందని.. దీని వల్ల తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. రాబోయే వారం రోజులకు ఎలాంటి తుఫాన్ హెచ్చరికలు ఇవ్వటం లేదని.. సముద్రం అంతా ప్రశాంతంగా ఉందని.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొచ్చని స్పష్టం చేసింది. 

టోటల్ గా రాబోయే వారం రోజులు అంటే.. డిసెంబర్ 19వ తేదీ వరకు ఎలాంటి వర్షం లేదు.. తుఫాన్ అలర్ట్ లేదు.. చిరు జల్లులు కూడా పడవు.. రైతులకు ఆందోళన వద్దు.. జనానికి పరేషాన్ లేదు.. అందరూ చక్కగా తమ తమ పనులను చేసుకోవచ్చు అనేది.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్...