వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(W.T.O) కు కొత్త చీఫ్గా నైజీరియాకు చెందిన నోజి ఒకాంజో ఇవేలాకు W.T.O నాయకత్వాన్ని అప్పగించేందుకు అమెరికా ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఆ సంస్థకు మొట్టమొదటి మహిళా చీఫ్గా.. మొదటి ఆఫ్రికా నేతగా కూడా ఒకోంజో నాయకత్వం వహించనున్నారు.
W.T.O చీఫ్ పోస్టుకు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరో పేరును ఖరారు చేశారు. దక్షిణ కొరియాకు చెందిన వాణిజ్య మంత్రి యో మయుంగ్ను డబ్ల్యూటీవో చీఫ్గా చేయాలని ట్రంప్ అనుకున్నారు. కానీ బైడెన్ ప్రభుత్వం… ట్రంప్ నిర్ణయాలన్నింటినీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. నోజి ఒకోంజోకు బైడన్ ప్రభుత్వం మద్దతు ఇవ్వగానే.. కొరియాకు చెందిన మంత్రి ఆ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ఆర్థికశాస్త్రం, అంతర్జాతీయ దౌత్యవిధానంలో నోజి ఒకోంజోకు అపారమైన జ్ఞానం ఉన్నట్లు అమెరికా తన ప్రకనటలో తెలిపింది.