విద్యార్థులు బహిర్భూమి కోసం అడవికి వెళ్లడం ఏంటి?..ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌సీ ఆగ్రహం

విద్యార్థులు బహిర్భూమి కోసం అడవికి వెళ్లడం ఏంటి?..ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌సీ ఆగ్రహం
  • ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌సీ ఆగ్రహం.. నివేదిక ఇవ్వాలని సంగారెడ్డి కలెక్టర్​కు ఆదేశం

న్యూఢిల్లీ, వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని బొమ్మారెడ్డిగూడెం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు బహిర్భూమి కోసం అటవీ ప్రాంతానికి వెళ్తున్నారన్న వార్తలపై ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌సీ తీవ్రంగా స్పందించింది. పాఠశాలలో మొత్తం 275 మంది విద్యార్థులకు 16 మరుగుదొడ్లు ఉంటే.. వాటిలో 6 నిరుపయోగంగా ఉండటంపై న్యాయవాది బాలచందర్ రెడ్డి కమిషన్‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. నిధులు మంజూరైనా మరుగుదొడ్లు నిర్మించడం లేదని తెలిపారు. బహిర్భూమి కోసం పిల్లలు అడవికి వెళ్లడం ఏంటి?..  ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, రెండు వారాల్లోగా యాక్షన్ టేకెన్ నివేదిక సమర్పించాలని సోమవారం కలెక్టర్‌‌‌‌ను ఆదేశించింది.