Fact Check : 2 వేల 500 ఉద్యోగాల నోటిఫికేషన్ నిజం కాదా..!

Fact Check : 2 వేల 500 ఉద్యోగాల నోటిఫికేషన్ నిజం కాదా..!

ఎన్‌హెచ్‌ఆర్‌డి (NHRD) రిక్రూట్‌మెంట్ 2024 నిజమా లేదా నకిలీనా అనే ప్రశ్న ఇప్పుడు ఉద్యోగార్థుల మదిలో మెదులుతోంది. నేషనల్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ పేరుతో ఒక నకిలీ వెబ్‌సైట్ NHRD రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ PDFని ప్రచురించింది. ఈ PDFలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC), అసిస్టెంట్ (IT), అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), MTS వంటి వివిధ పోస్టుల కోసం మొత్తం 2545 ఖాళీలున్నట్టు నోటిఫికేషన్ లో తెలిపారు. ఇప్పుడు వివిధ వెబ్‌సైట్‌లలో ఈ PDF షేర్  అవుతుండగా.. ఈ ఉద్యోగాల కోసం ఎవరూ దరఖాస్తు చేయవద్దని అభ్యర్థులను పలువురు కోరుతున్నారు.

వైరల్ అవుతోన్న పీడీఎఫ్ లో పేర్కొన్న చిరునామా అనేది NHRDకి సంబంధించింది కాదు. అందులో ఉన్న వెబ్ సైట్ అడ్రస్ కూడా ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన సమాచారాన్ని అందించదు. మరో ముఖ్య విషయమేమిటంటే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పీడీఎఫ్ లో అధికారిక సంతకం కూడా లేదు. వీటన్నింటి కారణాల చేత ఇది నకిలీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గా కూడా చెప్పవచ్చు.

NHRD రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్

జాతీయ మానవ వనరుల అభివృద్ధి NHRD రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ PDFని దాని అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తుంది. ముఖ్యమైన తేదీలు, ఖాళీలు, అర్హత ప్రమాణాలు, జీతం మొదలైన రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అన్ని వివరాలను ఈ PDFలో తెలియజేస్తారు. NHRD రిక్రూట్‌మెంట్ 2024లో త్వరలో NHRD అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురితమవుతుంది.